పోలీసు క్వార్టర్స్ లో ఉరికి వేలాడుతూ మహిళా కానిస్టేబుల్​ శవం..హత్యా..ఆత్మహత్యా?

Update: 2020-11-07 14:30 GMT
అనుమానా స్పద స్థితిలో ఓ మహిళా కానిస్టేబుల్​ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకున్నది. తాను నిద్ర పోయే సమయంలో తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్టు భర్త చెబుతున్నాడు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. విశాఖకు చెందిన చందక దుర్గా భవాని నక్కపల్లి పోలీస్ స్టేషన్‌ లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం తో కలిసి విశాఖ పోలీస్​క్వార్టర్స్​లో ఉంటున్నారు.

శనివారం ఉదయం దుర్గా భవాని తన క్వార్టర్స్‌ లోనే శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భర్త సింహాద్రి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తన భార్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో వెంటనే  తాడును కోసి కిందకు దించానని.. ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందిదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో భవాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కానిస్టేబుల్​ భర్త ఉరి తాడును కోసి కిందకు దించానని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News