విశాఖలో సంచలనం..కన్న కొడుకును సిలిండర్ తో మోది చంపిన తల్లి..
చదువుకుని ఉద్యోగం చేయాల్సిన వయసు. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన వాడు. శృతి తప్పాడు. నిత్యం మద్యం తాగుతూ ఎవరో ఒకరితో గొడవలు పడుతూ జులాయిగా తిరగడం.. ఇంటికొచ్చి తల్లిదండ్రులను వేధించడం.. వీటన్నిటినీ భరించలేక పోయిన కన్నతల్లి కొడుకును కసితీరా సిలిండర్ తో బాది చంపేసింది. ఈ సంచలన సంఘటన విశాఖలో జరిగింది. మధురవాడ లోని మారికవలస కాలనీలో కోట్ల శ్రీను, మాధవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కొడుకు అనిల్ తో పాటు ఒక కుమార్తె ఉంది.కొంతకాలం నుంచి అనిల్ చెడు తిరుగుళ్ళకు అలవాటు పడ్డాడు. వ్యసనాల బారిన పడి డబ్బులు కోసం నిత్యం తల్లిదండ్రులు వేధించేవాడు. బయటకు వెళ్ళిన ప్రతి రోజూ ఎవరో ఒకరితో గొడవపడే ఇంటికి చేరుకునే వాడు. ఇంట్లో కూడా తల్లిదండ్రులపై భౌతిక దాడులకు పాల్పడే వాడు.
అనిల్ ను మార్చడానికి తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా లాభంలేకపోయింది అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన తల్లి కుమారుడిని చంపాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును ఛాతి పై సిలిండర్ తో మోది దారుణంగా హత్య చేసింది. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పీఎం పాలెం పోలీసులు మాధవి ని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్న తల్లె కుమారుడిని హతమార్చడం ఆ ప్రాంతంలో సంచలనం రేపింది.