తల్లి మెడపై కత్తిపెట్టి హల్ చల్..ఏం డిమాండ్ చేశాడంటే!
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నడిరోడ్డులో ఓ వ్యక్తి ఉన్నట్టుండి తన తల్లి మెడపై కత్తి పెట్టాడు. తన డిమాండ్లు నెరవేర్చకుంటే ఆమె గొంతు కోస్తానంటూ హల్చల్ చేశాడు. దీంతో ఆ రోడ్డంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంతకీ డిమాండ్ ఏమిటని అడగగా ‘భువనేశ్వర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న చాలా మంది అవినీతిలో కూరుకుపోయారు. వెంటనే వాళ్లను అరెస్ట్ చేయాలి. లేదంటే నేను నా తల్లి గొంతుకోసి చంపేస్తా’ అంటూ చెప్పాడు సదరు యువకుడు. దీంతో అక్కడున్న ప్రజలంతా షాక్ అయ్యారు. న్యూస్ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. ఈ ఘటన భువనేశ్వర్ లోని అసెంబ్లీ ఎదురుగా జరగడం గమనార్హం. మరోవైపు లోపల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏం చేయాలో పాలుపోక పోలీసులంతా తీవ్రంగా ఆలోచించారు. చివరకు చాకచక్యంతో ఓ పోలీస్ యువకుడి చేతిలోనుంచి కత్తిని లాక్కొన్నాడు. సదరు యువకుడికి మానసిక స్థితి బాగాలేనట్టు సమాచారం.
ఇటీవల కొంతకాలంగా ప్రభుత్వం, నేతలపై దుర్భాషలాడుతూ రోడ్డు మీద తిరుగుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని తల్లి యువకుడిని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అసెంబ్లీ ఎదురుగా ఇలా చేశాడు. చివరకు పోలీసులు ఆ తల్లీ కొడుకులను తమ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడి అవినీతి పరుల గురించి డిమాండ్ చేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోషల్మీడియాలో ఈ ఘటనపై ట్రోల్స్ మొదలయ్యాయి.