• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్రలో దారునం...ఒకే...

మహారాష్ట్రలో దారునం...ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు !

By - Tupaki Desk
Update: 2021-04-28 05:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ పెరిగేకొద్ది ఎన్నో హృదయ విదారక దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కరోనా సోకి మృతిచెందిన వారికి  కనీస మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న కోర్టుల ఆదేశాలు దాదాపు ఎక్కడా అమలు కావడంలేదు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో అయితే ఈ పరిస్థితి అసలు కనిపించడం లేదు.  ఒకే అంబులెన్స్‌లో ఏకంగా 22 మృతదేహాలు కుక్కి తరలిస్తున్న ఘటన పై తీవ్ర స్థాయిలో విచుకుపడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ  ఘటనను చూపించవచ్చు.

వివరాల్లోకి వెళ్తే .. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబజోగైలో ఉన్న స్వామి రామనంద తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉంచిన మృతదేహాలను ఆదివారం ఈ విదంగా శ్మశానానికి తరలించారు. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ శివాజీ శుక్రే మంగళవారం మీడియాకు వివరణ ఇచ్చారు. మృతదేహాలను తరలించేందుకు ఆసుపత్రి యంత్రాంగం వద్ద తగినన్ని అంబులెన్స్‌లు లేవని, గతేడాది కరోనా తొలి దశ ఉద్ధృతి సమయంలో 5 అంబులెన్స్‌ లు ఉండేవని, తరువాత మూడింటిని ఉపసంహరించారని చెప్పారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద ఉన్న రెండు అంబులెన్స్‌ లలోనే కరోనా బాధితులను, మృతదేహాలను తరలిస్తున్నట్లు తెలిపారు.  కొన్ని సందర్భాల్లో కరోనా కారణంగా మరణించిన వారి బంధువులను గుర్తించడమూ కష్టంగా ఉంటోందని, లోఖాండీ సవర్‌గావ్‌ గ్రామంలో ఫ్రీజర్ లేని కారణంగా అక్కడి నుంచి కూడా మృతదేహాలను తమ కాలేజీకే పంపిస్తున్నారని శివాజీ శుక్రే తెలిపారు. తమకు మరో మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా గత నెల 17న జిల్లా యంత్రాంగానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని అయన తెలిపారు . ఏదేమైనా ఈ ఘటనను ప్రతి ఒక్కరూ కూడా తప్పుబడుతున్నారు.
Tags:    
  • Dangerous Disease In Maharashtra 
  • Maharashtra Marriage 
  • 700 Corona Case 
  • Telugu News 

Similar News

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

Copyright @2026

Powered by Blink CMS