భర్త..పిల్లల్ని వదిలేసిన ఆమె స్టేషన్ కు వచ్చింది.. వెంట ఎవరంటే?
కొద్ది రోజుల క్రితం వార్తల్లోకి వచ్చిన ఈ ఉదంతం కొత్త సంవత్సరం మొదటి రోజున సరికొత్త అప్డేట్ చోటు చేసుకుంది. పెళ్లై.. పిల్లలు ఉన్న ఒక మహిళ.. కొద్ది నెలలుగా కనిపించకపోవటం.. ఆమె భర్త పోలీసుల్ని ఆశ్రయించి.. తన భర్తను వెతికి పెట్టాల్సిందిగా కోరటం తెలిసిందే. గుర్తుకు రావటం లేదా? అయితే.. కాస్త వెనక్కి వెళితే.. విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ సిత్రమైన కేసు తాజా అప్డేట్ కు ముందు.. గతంలో ఏం జరిగిందన్న విషయంలోకి వెళదాం.
కాజీపేటకు చెందిన 35 ఏళ్ల మహిళ తన కంటే ఏడేళ్లు పెద్దవాడైన వ్యక్తితో 23 ఏళ్ల క్రితం పెళ్లైంది. వారికి 16 ఏళ్ల కొడుకు.. 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం అమలాపురానికి చెందిన ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమగా మారింది. భర్త.. బంగారం లాంటి ఇద్దరు పిల్లల్ని వదిలేసి.. గత ఏడాది ఆగస్టులో ఇంట్లో నుంచి 10 తులాల బంగారం.. 25 తులాల వెండి.. లక్షరూపాయిల నగదును తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. హైదరాబాద్ లోని బల్కంపేటలో నివాసం ఉంటోంది.
తన భార్య కనిపించటం లేదని.. ఇంట్లో ఉండాల్సిన బంగారం.. వెండి.. క్యాష్ కనిపించటం లేదంటూ భర్త హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో.. మహిళతో పాటు.. ఆమె ప్రియుడు కమ్ రెండో భర్తను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండో భర్తతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. తాజాగా భర్త.. తన భార్య మిస్సింగ్ అంటూ ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడో ట్విస్టు ఏమంటే.. ఆమె కోసం మొదటి భర్తతో పాటు రెండో భర్త కూడా గాలించారు.
తర్వాత ఏమైందో కానీ.. తాజాగా కొత్త సంవత్సరం మొదటి రోజున తన రెండో భర్తతో కలిసి సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. మొదటి భర్త గురించి.. పిల్లల గురించి అడిగినప్పుడు మాత్రం.. తనకు మొదటి భర్త లేడని.. పిల్లలు లేరని చెబుతోంది. మొదటి భర్త మాత్రం ఆమె.. తన భార్య అని చెబుతున్నాడు. దీంతో.. పోలీసులు ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.