చైనా సంచలన నిర్ణయం: మహమ్మారి పుట్టుకపై దర్యాప్తుకు ఓకే
మహమ్మారి వైరస్ చైనాలోని వూహన్‌లో ఉన్న ల్యాబ్ నుంచి లీకైందని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ మహమ్మారి విజృంభణకు చైనా బాధ్యత వహించాలని అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు కోరుతున్నాయి. ఈ మేరకు చైనాపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎట్టకేలకు చైనా కరోనా వైరస్ పుట్టుకపై దర్యాప్తునకు అంగీకరించింది. మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందనపై దర్యాప్తుకు చైనా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో కోట్లాది మందిపై ప్రభావం చూపిన కరోనా తొలిసారి బయటపడినప్పుడు తాము (చైనా) ఎంతో బాధ్యతతో వ్యవహరించినట్లు తెలిపారు. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తాము బహిరంగంగా పంచుకున్నామని చెప్పారు. కరోనాపై దర్యాప్తుకు చైనా ముందుకు రావాలంటూ యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానానికి 120కు పైగా దేశాలు మద్దతు పలకడంతో తాము ప్రపంచ స్పందన మేరకు సమగ్ర సమీక్ష కోసం చైనా మద్దతు ఇచ్చిందని ప్రకటించారు. కరోనాపై ప్రపంచం పట్టు సాధించిన తర్వాత సమీక్ష ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.
ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణలు ఇవి.. చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే మహమ్మారి వైరస్ పుట్టిందని ప్రధాన ఆరోపణ. ఆ వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రపంచానికి సమాచారం ఇవ్వకపోవడం, ఆ వైరస్ తీవ్రత చెప్పకపోవడం, వాస్తవాలు దాచిపెట్టిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చివరకు చైనా అంగీకరించి కరోనా వైరస్‌పై డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు అంగీకరించింది. దీనిపై అమెరికాతో సహా ఇతర దేశాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.