‘కేసీఆర్.. జగన్ పార్టన్లరు.. ఆంధ్రోళ్లతో కలిసి దొర దోపిడీ’.. ఈ మాట అన్నది ఎవరంటే?
సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్. ఇటీవల కాలంలో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకోవటం తెలిసిందే. తెలంగాణ పీసీసీ పీఠం మీద రేవంత్ ను కూర్చోబెట్టిన నాటి నుంచి కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అన్నింటికి మించిన గడిచిన కొన్నేళ్లుగా పెద్దగా మాట్లాడని మాజీ ఎంపీ మధుయాష్కీ ఈ మధ్య కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమనగల్లులో విలేకరులతో మాట్లాడిన వేళ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మలి ఉద్యమంలో తొలి ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేయబోతే పోలీసులు అడ్డుకున్నారని.. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విద్యార్థి.. నిరుద్యోగ జంగ్ సైరన్ తో కారు జంగ్ ఖాయమన్నారు. సైరన్ సౌండ్ కు సీఎం కేసీఆర్ కంగు తింటున్నారన్నారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల్లో కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు భాగస్వామ్యం ఉందన్నారు. ఆంధ్రోళ్లతో కలిసి దొర దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆయన.. తెలంగాణ యువతకు బతుకుదెరెవు కరువైందన్నారు.
కేసీఆర్ దొంగ దీక్షల వల్ల తెలంగాణ రాలేదన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మధు యాష్కీ.. అమరుల త్యాగాలు.. యువత ఆత్మహత్యలు.. సబ్బండ జాతుల పోరుతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యార్థులు.. యువత చదువుకొని డెవలప్ అయితే తమకు అధికారం పోతుందన్నఅక్కసుతోనే అన్ని వర్సిటీల్లో సగానికి పైనే ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయటం లేదన్నారు.
యువత అభివృద్ధి మరిచి గల్లీకో వైన్ షాప్ ను ఏర్పాటు చేసి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారన్న కేసీఆర్.. తెలంగాణలోని ప్రాజెక్టులకు ఆంధ్రోళ్లకే కాంట్రాక్టులు ఇవ్వటం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ మీద మధు యాష్కీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.