బీసీసీఐపై సెహ్వాగ్ ఫైర్.. రవిశాస్త్రికి రోహిత్ పరిస్థితి తెలీదంటే నమ్మేదెలా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ ఎంపిక కాకపోవడం పై చర్చ నడుస్తోంది. సెలెక్టర్లపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. గాయం ఏంటి.. గాయం తీవ్రత ఏంటి..వంటి వివరాలు తెలపలపకుండానే మూడు ఫార్మాట్లలో అతడికి జట్టులో చోటు కల్పించకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది.చిన్నపాటి గాయానికే హిట్‌మ్యాన్‌ను ఎలా పక్కనబెడతారు? గాయం నుంచి కోలుకొని ఐపీఎల్‌లో మళ్లీ ఆడుతున్నాడు కదా.. మీరెందుకు సెలెక్ట్ చేయలేదు? అంటూ ట్రోల్ చేస్తున్నారు.తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేరారు. రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహార శైలి సరిగా లేదంటూ ఘాటు విమర్శలు చేశారు. రోహిత్ పరిస్థితి ఏంటో తనకు తెలియదని రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదగా ఉన్నాయని మండిపడ్డాడు.
'' రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. అతడు చెప్పిన దానితో ఏకీభవించను. సెలక్షన్ కమిటీలో ఆయన భాగం కానప్పటికీ.. సెలెక్షన్‌కు రెండు మూడు రోజుల ముందైనా కోచ్ అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన్నుంచి కొన్ని సూచనలు తీసుకుంటారు. ప్రాంచైజీ తరపున ఆడటానికి సిద్ధంగా ఉన్న ఒక ఆటగాడిని ఎంపిక చేయకపోవడం లో బీసీసీఐ తప్పిదం కనిపిస్తోంది.
ఒకవేళ రోహిత్ గాయపడితే అతడి స్థానంలో మరొకరిని ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. అలా జరగలేదు. రోహిత్‌నూ జట్టులోకి తీసుకోలేదు.ఈ వింత పరిస్థితి నాకర్థం కావడం లేదు. ఈ ఏడాది అన్ని వింతలే జరుగుతున్నాయి. హైదరాబాద్‌పై రోహిత్ శర్మ ఆడాడు. ప్లేఆఫ్స్ కూడా ఆడతాడు. తాను బాగానే ఉన్నానని చెబుతున్నాడు. అలాంటప్పుడు అతడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదు.'' అంటూ వీరూ బీసీసీఐని ప్రశ్నించారు. ఐపీఎల్ లో తదుపరి మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీసీసీఐ వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోందని.. ఐపీఎల్ లో ఆడుతున్న రోహిత్‌ను, జాతీయ జట్టులోకీ తీసుకోవచ్చు కదా అని సెహ్వాగ్ మండిపడ్డాడు.