కరోనా పోకముందే మరో డేంజర్​ వైరస్​ వచ్చేసింది... ఇది పురుషులకు మాత్రమే సోకుతుందట!

Update: 2020-10-31 04:15 GMT

కరోనా వైరస్​ ఎప్పుడు అంతరిస్తుందా..అని  ప్రజలు ఎదురుచూస్తున్న వేళ మరో డేంజర్​ వైరస్​ వచ్చేస్తుంది. ఈ కొత్త వైరస్​ కేవలం మగాళ్లకే సోకుతుందట. ప్రస్తుతం పురుషులకు మాత్రమే అత్యధికంగా సోకుతున్న ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ వైద్యులు గుర్తించారు. దీనికి ‘వెక్సాస్ సిండ్రోమ్’గా పేరుపెట్టారు. ఈ కొత్తవైరస్​ రోజురోజుకు విస్తరిస్తన్నదని..  దీని బారినపడుతున్న పురుషుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ  వైరస్​ సోకితే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు.

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కి చెందిన నేషనల్ హ్యుమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  (ఎన్​హెచ్​జీఆర్​ఐ) శాస్త్రవేత్తలు ఈ కొత్త సిండ్రోమ్ ను కనుగొన్నారు. యూబీఏ 1 జన్యువులోని మ్యుటేషన్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వాక్యూల్స్, ఈ1 ఎంజైమ్, ఎక్స్- లింక్డ్, ఆటో ఇన్ఫ్లమేటరీ అండ్ సోమాటిక్ సిండ్రోమ్(వెక్సాస్)గా పిలుస్తారు. ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  ఇది కేవలం X క్రోమోజోమ్ తో ముడిపడి ఉండటం వల్ల, పురుషుల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందట. మహిళల్లో ఉండే  అదనపు X క్రోమోజోమ్ వారికి రక్షణగా పనిచేస్తాయని, దీని వల్ల మహిళల్లో ఈ వ్యాధి సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధి సోకిన వారికి సిరల్లో రక్తం గడ్డకట్టడుతుంది. తరచుగా జ్వరం వస్తుంది. మైలోడెడ్ కణాల్లో వాక్యూల్స్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ వ్యాధిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేక పద్ధతిని పాటించారు. ఈ వ్యాధి నిర్థారణకు గాను 2,500 మంది రోగుల జన్యుశ్రేణులపై అధ్యయనం నిర్వహించారు. ఫలితంగా కొందరిలో యూబీఏ1 అనే జన్యువును వారిలో గుర్తించారు. ఇది వెక్సాస్ అనే ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కు కారణమవుతుందని తేల్చి చెప్పారు. అయితే అన్ని జన్యువుల్లో 2 కాపీలుంటే దీనిలో మాత్రం ఒక్కటే కాపీ ఉందని, అది కూడా ఎక్స్ క్రోమోజోమ్లో ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మిస్టర్ డేనియల్ కాస్ట్నర్ పేర్కొన్నారు.
Tags:    

Similar News