కత్తిలాంటి ఫిగర్ కు కరెక్టు అర్థం ఆమే..

Update: 2016-08-02 22:30 GMT
అందం అనేది చూసే కంటిని బట్టి ఉంటాదంటారు.. ఆ ఆనందం అనేది అనుభవించడాన్ని బట్టి ఉంటాదనీ చెబుతుంటారు. కానీ - శాస్ర్తవేత్తలు మాత్రం ప్రతిదాన్నీ కొలతలు వేసి నిర్ణయిస్తుంటారు. అందుకే అందం కూడా కొలతలు - పెరామీటర్సు పరిధిలోకి చేరిపోయింది. ఆ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే పెర్ఫెక్టు ఫిగర్ ఎవరన్నది టెక్సాస్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు తేల్చారు. వారి లెక్కల ప్రకారం పెర్ఫెక్టు ఫిమేల్ బాడీ అంటే 1.68 మీటర్ల ఎత్తు ఉండాలట. అంటే 5.512 అడుగుల ఎత్తన్నమాట. ఎత్తొక్కటే కాదు మిగతా ఎత్తుల లెక్కలు కూడా ఈ శాస్త్రవేత్తలు చెప్పారు.

టెక్సాస్ యూనివర్సిటీ వారు తీవ్రంగా మథించి వేసిన లెక్కలు.. ప్రపంచంలోని ఎందరో సుందరాంగిల కొలతలు పరిశీలించిన తరువాత మోడల్ - నటి - టీవీ ప్రజెంటర్ కెల్లీ బ్రూక్ ను ప్రపంచంలోనే కత్తి లాంటి ఫిగర్ గా గుర్తించారు. శాస్త్రవేత్తల లెక్కలకు సరిపడేలా ఈమెకు అన్ని కొలతలు సరిపోయాయి. అంతేకాదు.. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండానే ఆమెకు ఈ ఒంపుసొంపులు ఉన్నాయట. 168 సెంటీమీటర్ల ఎత్తున్న కెల్లీ మిగతా కొలతలు 99-63-91 సెంటీమీటర్లట. అంటే మనోళ్ల లెక్కల ప్రకారం సుమారు 38-25-36 అంగుళాల కొలతలట.

అయితే.. కేవలం ఈ కొలతలే కాకుండా చాలా అంశాల ప్రాతిపదికగా ఈ అధ్యయనం చేశారు. బరువు - జుత్తు పొడవు - ముఖాకృతి వంటివీ పరిశీలించారు. మరీ సన్నగా కాకుండా బొద్దుగా కాకుండా నాజూగ్గా ఉన్న శరీరమే సరైనది తేల్చారు. కెల్లీ ఫొటోలు చూస్తే మీరు కూడా ఆమెకు మించిన ఫర్ఫెక్టు ఫిగర్ లేదనడం ఖాయం.
Tags:    

Similar News