లోకేశ్ పాదయాత్ర తొలి రోజు షెడ్యూల్ ఏంటి?

Update: 2023-01-24 10:31 GMT
ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్.. జనవరి 27నుంచి తన పాదయాత్రను షురూ చేయనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును లోకేశ్ చేసినట్లుగా చెబుతున్నారు.

గతంతో పోలిస్తే పూర్తిగా స్థాయిలో బరువు తగ్గిన ఆయన.. పాదయాత్రలో భాగంగా మరింత ఫిట్ గా ఉండేందుకు వీలుగా కొన్ని నెలలుగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతులు ఓకే చేశారు.

దీనికి సంబంధించిన నిర్ణయాన్ని మంగళవారం రాత్రి వేళలో తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లోకేశ్ నిర్వహించే పాదయాత్ర మొదటి రోజు షెడ్యూల్ ను పక్కాగా సిద్ధం చేశారు.

-  జనవరి 25న మధ్యాహ్నం1.20 గంటలకు హైదరాబాద్ లోని ఇంటినుంచి బయలుదేరుతారు
-  జనవరి 25న మధ్యాహ్నం  ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి.. ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు
-  నివాళులు అర్పించిన తర్వాత శంషాబాద్ లో మధ్యాహ్నం 3.15 గంటల వేళలో ఫ్లైట్ ఎక్కుతారు.
-  సాయంత్రం 4.30 గంటలకు కడప చేరుకుంటారు.
-  కడపలో అమీన్ పీర్ దర్గాను.. తర్వాత రోమన్ కేథలిక్ కెథడ్రల్ చర్చిని సందర్శిస్తారు
-  సాయత్రం కడప నుంచి బయలుదేరి రాత్రి పదిన్నరకు తిరుమల చేరుకుంటారు.
-  అక్కడ రాత్రి వేళలో బస చేసి.. 26 ఉదయం 10.30 గంటలకు తిరుమల నుంచి బయలుదేరుతారు
-  మధ్యాహ్నం 2.30 గంటల వేళలో కుప్పం చేరుకుంటారు.
-  కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెడతారు.
-  జనవరి 27న కుప్పం నుంచి తన పాదయాత్రనుషురూ చేశారు
-  పాదయాత్రకు కాస్త ముందు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోవటానికి కొండకు వస్తారు
-  శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత కుప్పం నుంచి పాదయాత్రనను మొదలు పెడతారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News