ప్రపంచ బ్యాంక్ సారథిగా భారతీయ మహిళ
సుందర్ పిచాయ్- సత్యనాదెళ్ల.. ఇలా భారతీయులు ప్రపంచప్రఖ్యాత గూగుల్- మైక్రోసాప్ట్ సీఈవోలుగా దేశ గౌరవాన్ని అమెరికా కేంద్రంగా ఇనుమడింప చేస్తున్నారు. ఇక మరెన్నో సంస్థలు కూడా భారతీయుల చేతుల్లో ఉన్నాయి. భారతీయ మేధోసంపత్తికి ప్రఖ్యాత కంపెనీలే గులాం అవుతున్నాయి. ఇప్పుడు అదే కోవలో మరో గొప్ప గౌరవం భారతీయ మహిళకు దక్కింది. ఒక భారతీయ మహిళక అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి లభించడం ఇదే తొలిసారి.
*భారతీయ మహిళకు అత్యున్నత పదవి..
ప్రపంచ బ్యాంక్ ఎండీగా భారతీయ మహిళ ఎంపిక అవ్వడం విశేషం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న అన్షులా కాంత్ ను తాజాగా ప్రపంచబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమిస్తూ ప్రపంచబ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్బాస్ ప్రకటించారు. 35 ఏళ్లుగా ఎస్బీఐలో ఆమె పనిచేసిన అనుభవం , సృజనాత్మకత, సాంకేతిక పనితీరు వల్ల ప్రపంచ బ్యాంక్ లోని ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు.
*ఎస్బీఐని నిలబెట్టారు..
ప్రపంచ బ్యాంక్ లో అన్షులా కాంత్ ఆర్థిక వ్యవహారాలు, రిస్క్ మేనేజ్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఈమె ఎస్ బీఐని 38 బిలియన్ డాలర్ల ఆదాయానికి చేర్చి , 500 బిలియన్ డాలర్ల ఆస్తులను సమకూర్చారు. ఈమె దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు ఎస్బీఐ పురోగతికి దోహదం చేశాయి. అన్షుల్ కాంత్ 2018 సెప్టెంబర్ నుంచి ఎస్బీఐ ఎండీగా కొనసాగుతున్నారు.
* అన్షులా కాంత్ ప్రస్థానం..
అన్షులా కాంత్ స్వస్థలం ఢిల్లీ. ఈమె ఢిల్లీలోని వుమెన్స్ శ్రీరామ్ కాలేజీ లో అర్థశాస్త్రంలో పిజీ చేశారు. అనంతరం 1983లో ప్రొబెషనరీ ఆఫీసర్ గా ఎస్బీఐలో ఉద్యోగాన్ని ప్రారంభించారు. రిటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ క్రెడిట్, క్రాస్-బోర్డర్ ట్రేడింగ్ మరియు అభివృద్ధి చెందిన మార్కెట్లలో బ్యాంకింగ్ రంగాల్లో విస్తృతమైన అనుభవం సంపాదించారు. మూడు దశాబ్ధాల పాటు ఎస్బీఐలో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఇప్పుడు ప్రపంచబ్యాంకుకే ఎండీగా నియమితులయ్యారు.