చిన్నమ్మకి ఆ రూ. 10 కోట్లు ఎలా వచ్చాయి ... మళ్లీ మొదటికొచ్చేలా ఉందే !

Update: 2020-10-31 13:50 GMT
చిన్నమ్మ ..అలియాస్ శశికళ. తమిళనాడు లో ఈ చిన్నమ్మకి , చిన్నమ్మ పేరుకి ఉన్న ప్రత్యేకతే వేరు. జ‌య‌ల‌లిత  స‌మాధి మీద క‌సి వెల్ల‌బోసుకున్న చిన్నమ్మ , ప్రస్తుతం అక్ర‌మాస్తుల కేసులో నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్నారు. అయితే , అతి త్వరలో చిన్నమ్మ బయటకి రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ లకు బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017 ఫిబ్రవరి 14వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో వారంతా శిక్ష అనుభవిస్తున్నారు. అయితే మధ్యలో శశికళ పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆమె జైలు నుండి బ‌య‌టికొచ్చి షాపింగులు చేశార‌నీ.. అదీ జైలా ఫైవ్ స్టార్ హోట‌లా అని..ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే , ఏదేమైనా కూడా చిన్నమ్మకి విధించిన శిక్షా కాలం ముగియబోతుంది. కేవలం జరిమానా చెల్లించడమే మిగిలి ఉంది. అయితే , ఆ జరిమానా చెల్లించేందుకు ఆమె అనుచరులు కొందరు ఇప్పటికే బెంగళూరులో తిష్టవేసినట్లు ప్రచారం జరుగుతుంది.

చిన్నమ్మ స్రత్పవర్తన కింద శశికళ ముందే విడుదలవుతారని ఆమె న్యాయవాది పలుమార్లుచెప్పారు . బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్‌ సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయాన్ని స్పష్టం చేయాలని కోరినపుడు వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కాగలరని జైళ్లశాఖ బదులిచ్చింది.  పెరోల్‌పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి స్రత్పవర్తన కింద 120 రోజుల మందే శశికళ విడుదల ఖాయమని ఆమె అభిమానులు కూడా అంటున్నారు. అయితే , జైలు అధికారులను మభ్యపెట్టి శశికళ బెంగళూరు నుంచి అనధికారికంగా బయటకు వచ్చి షాపింగ్‌లు చేసినట్లు గతంలో బెంగళూరు జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపణలు చేసి నిరూపించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో  స్రత్పవర్తన పరిధిలోకి శశికళ రారని మరికొందరు వాదిస్తున్నారు. కానీ కోర్టుల ఎవ్వారంలో  ఏం జ‌రుగుతుందో ఎవ్వరం చెప్పలేము.

ఇక్కడే మరో సమస్య కూడా ఉంది. రూ.10 కోట్ల జరిమానా చెల్లింపులో చిక్కులు తలెత్తాయి. ఇప్పటికే అనేకసార్లు ఐటీ దాడులను ఎదుర్కొన్న శశికళకు రూ.10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మరోసారి అధికారులు ఆరాతీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. జరిమానా చెల్లింపు, ఆ మొత్తంపై ఐటీశాఖ నుంచి స్పష్టత, జైళ్ల శాఖ నుంచి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కానీ, చిన్నమ్మ విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే , అనుచరులు మాత్రం  కోర్టుకు దశరా, మిలాడినబి సెలవులు ముగిసిన తరువాత వచ్చేనెల 2న శశికళ విడుదలపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ప్రచారం చేస్తున్నారు. 
Tags:    

Similar News