ఓ జెంటిల్ మెన్ పవన్..మీనుంచి ఆశిస్తోంది అదొక్కటే?

Update: 2020-09-11 08:10 GMT
విజయనగరం గజపతి రాజుల కుటుంబానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై వివాదం నడుస్తోంది. ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తనను టార్గెట్ చేసిన వారికి వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు.

ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. తాజాగా జనసేన పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు.

మాన్సాస్ ట్రస్ట్ హిందూయేతరుల సారథ్యంలో నడుస్తోందని పవన్ చేసిన వ్యాఖ్యలను సంచయిత ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను హిందువును అను.. తన తల్లిదండ్రులు ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజు హిందువులు అన్నారు.తన  తల్లి ఉమా గజపతి రాజు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమేశ్ శర్మను రెండో వివాహం చేసుకున్నారని ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఆయన ఫిల్మ్ మేకర్ గా ఆరుసార్లు జాతీయ , అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు.

సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టులో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని.. అందుకే తమ అవినీతి, అవకతవకలు బయటపడుతాయని టీడీపీ నేతలు భయపడుతున్నారని సంచయిత అన్నారు.

ఇక పవన్ చేసిన వ్యాఖ్యలు సరిచేసుకుంటూ ప్రకటన విడుదల చేయాలని సంచయిత కోరారు. ‘ఓ జెంటిల్ మెన్ గా మీ నుంచి తాను ఆశిస్తున్నది అదొక్కటే’ అని సంచయిత స్పష్టం చేశారు.
Tags:    

Similar News