• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నోటీసులను రద్దుచేసిన...

నోటీసులను రద్దుచేసిన ఆర్టీసీ యాజమాన్యం!

By - Tupaki Desk
Update: 2022-05-17 03:29 GMT
మైలేజీ తగ్గిందని చెప్పి బస్సు డ్రైవర్ల జీతాల్లో రికవరీ చేయాలన్నా నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది.  మైలేజీకి బస్సు డ్రైవర్ల జీతాలకు ముడిపెడితు కోత విధించాలని అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ డిపో మేనేజర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఆర్టీసీ మేనేజ్ మెంట్ కు అసలు సంబంధమే లేదు. కేవలం డిపోమేనేజర్ల పరిధిలో ఓవర్ యాక్షన్ పరంగా తీసుకున్న నిర్ణయానికి యాజమాన్యం సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది.

మైలేజీ తగ్గిన కారణంగా జీతాల్లో ఎందుకు కోత విధించకూడదో సమాధానాలు చెప్పాలని చాలామంది డ్రైవర్లకు మేనేజర్ల కార్యాలయాలు నోటీసులిచ్చాయి. దీంతో డ్రైవర్లలో అలజడి మొదలైంది. బస్సు మైలేజీ రావాలంటే ఒక్క డ్రైవర్ నైపుణ్యం మీద మాత్రమే ఆధారపడి ఉండదు.

రోడ్డు బాగుండాలి, ట్రాఫిక్ సమస్యలుండకూడదు, బస్సు మైన్ టెనన్స్ బాగుండాలి, బస్సు ఓవర్ లోడ్ తో ప్రయాణించకూడదనే చాలా కారణాల మీద మైలేజీ ఆధారపడుంటుంది.

మన దగ్గర రోడ్లు ఎలాగున్నాయో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఆర్టీసీలో ఇపుడున్న బస్సుల్లో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. ఇక బస్సులో సామర్ధ్యానికి మించి లోడుంటుంది. ఒక బస్సులో 40 మందికన్నా ప్రయాణించకూడదు. కానీ బస్సులో 60, 70 మంది ఎక్కేస్తారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కితే ఓవర్ లోడ్ సమస్యతో స్పీడు పోలేదు.

ఇలాంటివేవీ పట్టించుకోని డిపో మేనేజర్లు మైలేజి తగ్గిపోవటానికి కేవలం డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేస్తున్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో విషయం యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. దాంతో విషయంపై అంతర్గతంగా విచారణ జరిపి నోటీసుల జారీకి డిపోమేనేజర్లే కారణమని తేల్చింది.

దాంతో డిపోమేనేజర్లపై యాజమాన్యం మండిపడింది. డ్రైవర్లకిచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నోటీసులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. యాజమాన్యం ఆదేశాల కారణంగా డిపో మేనేజర్లు డ్రైవర్లకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవటమే కాకుండా రద్దు కూడా చేసుకుంటున్నారు.
Tags:    
  • RTC 
  • AndhraPradesh 
  • Manger 
  • Mileage 
  • BusDrivers 
  • Traffic 
  • Depo 
  • Ankapalli 
  • Vishkapatnam 
  • TupakiNews 

Similar News

యుద్ధంలో గెలుపు ఎవరిది? రష్యాకు మిగిలేది శవాల లెక్కేనా?

2026-11-09 15:30 GMT

70 కోట్ల విలువైన‌ న‌కిలీ రూ.20 కాయిన్‌లు త‌యారు చేసిన కేటుగాళ్లు!

2026-11-09 14:30 GMT

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

చంద్రబాబు సంకేతాలు.. రూ.500 నోట్లు రద్దు అయ్యే చాన్స్!

2026-11-09 10:29 GMT

ట్రంప్ ఓడిపోయాడు.. దెబ్బకు మన రూపాయి అత్యంత బలపడింది..

2026-11-09 10:29 GMT

Copyright @2026

Powered by Blink CMS