• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  యూపీఏ సర్కార్ రికార్డును...

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

| పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడిన 88 రోజులైనా ప్రోరోగ్ ప్రకటన విడుదల చేయకపోవడంతో మోదీ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్రం తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది.

By - Tupaki Political Desk
Update: 2026-11-09 11:02 GMT

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అరుదైన రికార్డును నమోదు చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వాయిదా వేసిన 88 రోజులకు కూడా ముగిసినట్లు ప్రకటించకుండా 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన రికార్డును అధిగమించింది. సహజంగా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన వారం, పది రోజుల్లో ప్రోరోగ్ (సమావేశాల ముగింపు ప్రకటన) చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఈ సారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసి దాదాపు 88 రోజులు అయినా ఇప్పటివరకు ఈ ప్రకటన విడుదల కాలేదు. దీంతో శీతాకాల సమావేశాలలోపు మరోసారి పార్లమెంటును సమావేశపరిచే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.

అంతుచిక్కని వ్యూహం

పార్లమెంటు సమావేశాలను ప్రోరోగ్ చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. పార్లమెంటును వాయిదా వేసిన తర్వాత తిరిగి సమావేశపరచాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ప్రోరోగ్ చేయదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రోరోగ్ చేసిన తర్వాత సమావేశాలు పెట్టాలంటే కనీసం 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సివుంటుందని, అదే ప్రోరోగ్ చేయకుండా ఉంటే కేవలం రెండు రోజుల ముందు సమావేశాలు ప్రారంభమవుతాయని సమాచారం ఇస్తే సరిపోతుందని అంటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఆగస్టు 13న నిరవధిక వాయిదా వేశారు. అప్పటి నుంచి ప్రోరోగ్ ప్రకటన విడుదల కాకపోవడంతో తిరిగి పార్లమెంటు సమావేశమవుతుందనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయినా కేంద్రం మాత్రం చలించలేదు. ఇలా 88 రోజులు గడిచిపోవడంతో కేంద్రం వ్యూహం ఏమైవుంటుందో అర్థం చేసుకోలేకపోతున్నామని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆ రెండు బిల్లుల కోసమే..

పార్లమెంటు వర్షకాల సమావేశాలను ప్రోరోగ్ చేయకపోవడానికి ప్రధానంగా మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించుకోవాలనే ఏకైక ఆలోచన ఉందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ చేయాల్సిన ఈ రెండు బిల్లుల ఆమోదానికి తగిన బలం లేకపోవడం వల్ల విపక్షాల మద్దతు సేకరణకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఈ ప్రయత్నాలు ఏవీ కొలిక్కి రాకపోవడంతో పార్లమెంటు సమావేశాలపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏప్రిల్ 17న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి 131వ రాజ్యాంగ సవరణకు ప్రభుత్వం ప్రయత్నించిందని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో విపక్షాలు ఐక్యంగా ఉండటంతో కేంద్రం ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న నాటకీయ రాజకీయ పరిణామాలతో కేంద్రంలో బలం పెరిగిందని బీజేపీ భావిస్తున్నా, ఇంకా అవసరమైన మద్దతు లభ్యం కాలేదన్న ఆలోచన, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాల వల్ల జాప్యం జరుగుతోందని చెబుతున్నారు.

శీతాకాల సమావేశాలకు సమయం ఆసన్నం

ఏటా పార్లమెంటు మూడు సార్లు సమావేశమవుతుంది. తొలుత బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి, మార్చిలో బడ్జెట్ సెషన్ ముగిసిన తర్వాత పార్లమెంటును ప్రోరోగ్ చేస్తారు. మళ్లీ జులై, ఆగస్టు నెలల్లో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇవి ముగిసిన తర్వాత నవంబరు చివరి వారం లేదా డిసెంబరు తొలి వారంలో శీతాకాల సెషన్ మొదలు అవుతుంది. ప్రస్తుతం నవంబరు తొలివారం ముగిసింది. మరో మూడు వారాల్లో అంటే డిసెంబరు 4 నుంచి శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో వర్షాకాల సమావేశాల ప్రోరోగ్ పై సస్పెన్స్ నెలకొందని అంటున్నారు. ఈ సమావేశాలను ప్రోరోగ్ చేసిన తర్వాతే శీతాకాల సమావేశాలకు నోటీసులు ఇవ్వాల్సివుందని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? శీతాకాల సమావేశాలకు ముందు అత్యవసర సమావేశాలు ఏమైనా నిర్వహిస్తారా? లేక నేడో రేపో ప్రోరోగ్ ప్రకటన జారీ చేసి శీతాకాలం సెషన్ కు రూట్ క్లియర్ చేస్తారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    
  • parliament 
  • modigovernment 
  • monsoonsession 
  • wintersession 
  • womensreservation 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS