ఆర్టీసీ బస్టాండ్లు... బాబు పనిని కొనసాగిస్తున్న జగన్

Update: 2021-02-21 01:30 GMT
ఆర్టీసీని ఆర్ధికంగా బలోపేతం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది. అవకాశం ఉన్న ప్రతి బస్టాండులోని స్పేస్ ను నూరుశాతం ఉపయోగించుకోవాలన్నది తాజా వ్యూహం. దాదాపు చాలా బస్టాండుల్లో విశాలమైన ఓపెన్ స్పేసులు వృధాగా పడుంటున్నాయి. వీటిన్నింటిలో షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించి వేలంపాటల పద్దతిలో వ్యాపారస్తులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రం మొత్తం మీదున్న బస్టాండుల్లో సుమారు 150 దాకా మంచి ఆదాయవనరులున్నవిగా ఉన్నతాధికారులు గుర్తించారు. వీటిల్లో కూడా జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, కాకినాడ, తిరుపతి లాంటి కీలక ప్రాంతాల్లోని బస్టాండులు అదనంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లోని బస్టాండులన్నింటిలోను పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించి వేలంపాటల పద్దతిలో కేటాయిస్తే ఆర్ధికంగా బలోపేతం అవటానికి బాగా అవకాశాలున్నట్లు గుర్తించింది ప్రభుత్వం.

 షాపింగ్ క్లాంప్లెక్సుల్లో కూడా చేనేత వస్త్రాలు, అమూల్ పాల ఉత్పత్తులు తదితరాలకు టాప్ ప్రయారిటీ ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఎంపిక చేసిన 15 బస్టాండుల్లో ప్రయోగాత్మకంగా చేనేత వస్త్రాలు, అమూల్ పాల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచబోతున్నారు. ఇదే పద్దతిలో విశాఖపట్నంలోని ద్వారాక బస్టాండులో మత్స్యశాఖకు ఓ స్టాల్ ను ప్రభుత్వం కేటాయించింది. అమ్మకాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి.

నిజానికి బస్టాండుల నుండి ఆదాయాలను పెంచుకోవాలని తెలుగుదేశంపార్టీ ప్రభుత్వమే నిర్ణయించింది. అయితే ఎందుకనో ప్రతిపాదనల్లో పెద్దగా కదలిక రాలేదు. ఇపుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసిన జగన్ సర్కార్ ఇపుడు ఆదాయాలను పెంచే విషయంలో దృష్టి సారించింది. ఇందులో గనుక ప్రభుత్వం సక్సెస్ సాధిస్తే ఆర్టీసీకి అదనపు ఆదాయం మొదలైనట్లే.
Tags:    

Similar News