ఐపీఎల్‌ చరిత్రలో ఏకైక బ్యాట్ మెన్ గా రోహిత్ ఘనత

Update: 2021-09-24 10:30 GMT
ఐపీఎల్‌ చరిత్రలో ఏకైక బ్యాట్ మెన్ గా రోహిత్  ఘనత
ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ చాలా రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి ఐపీఎల్‌ లో మాత్రం, సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ మరియు కేఎల్‌ రాహుల్‌ పలు రికార్డులు సాధించగా, తాజాగా మరో రికార్డు క్రియేట్‌ అయింది. ఐపీఎల్‌ క్రికెట్‌ చరిత్ర లో అరుదైన రికార్డు సృష్టించాడు హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ. ఐపీఎల్ లో ఒకే జట్టుపై అత్యధిక రన్స్‌ చేసిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు ఈ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ. కోల్‌కతా పై వెయ్యి పరుగుల మార్క్‌ను క్రాస్ చేశాడు రోహిత్‌.

ఒకే జట్టుపై వెయ్యి రన్స్‌ చేసిన ఏకైక బ్యాట్స్‌ మెగాన్‌ గా నిలిచాడు రోహిత్ శర్మ. హిట్‌ మ్యాన్‌ అంటే ఏంటో మరోసారి నిరూపించాడు రోహిత్‌శర్మ. ఇప్పటి వరకు ఏ ఆటగాడికి సాధ్యంకాని ఫీట్‌ను అధిగమించాడు. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఐపీఎల్‌ లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు హిట్‌ మ్యాన్. నాలుగో ఓవర్‌ లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టి, ఒకే టీమ్‌ పై వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.

ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ఒకే జట్టుపై 1000 పరుగుల మార్క్‌ ని అందుకున్న ఏకైక బ్యాట్స్‌ మెన్‌ రోహిత్‌ శర్మనే కావడం గమనార్హం. ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పై ఇప్పటి వరకూ 1011 పరుగులు చేశాడు హిట్‌ మ్యాచ్‌ రోహిత్ శర్మ. అతని తర్వాత స్థానంలో ఈ రికార్డ్‌లో ఉన్నాడు హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. పంజాబ్ కింగ్స్‌పై ఇప్పటి వరకూ 943 పరుగులు చేశాడు డేవిడ్‌ వార్నర్‌. అలానే కోల్‌‌కతా పై కూడా 915 పరుగులు చేసిన మూడో స్థానంలోనూ కొనసాగుతున్నాడు వార్నర్. ఇక ఢిల్లీపై 909 రన్స్ చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు కోహ్లీ.


Tags:    

Similar News