‘నీట్’.. ఇంత నీట్ గా ఏంటండి.?
సీరియస్ గా పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ముక్కుపుడక తీస్తూ కనిపించారు. చేవిపోగులు తీసి భద్రపరుస్తున్నారు.. మెడలో నెక్లస్ లు, చైన్లు, చేతిపై రింగ్ లు, ఒంటిపైన ఆభరణాలను తొలగిస్తూ అగుపించారు. ఏంటని తరిచి చూస్తే అప్పుడే తెలిసింది... అక్కడ ‘నీట్’ పరీక్ష జరుగుతోందని..
అగ్గిపుల్ల , సబ్బు బిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ.. కానీ ఏది తెచ్చుకున్నా.. ఒంటిపై ఏదున్నా పరీక్షకు అనర్హులే అంటోంది నీట్ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ).. బట్టలు వేసుకున్నా కాపీ చేయొచ్చని వాటిని విప్పించినా విప్పిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు దుస్తుల విషయంలో కూడా పలు నిబంధనలు పెట్టడం విశేషం. ఆ డ్రెస్ కోడ్ ప్రకారమే విద్యార్థులందరూ వేసుకురావడం గమనార్హం. లేత దుస్తులు, సన్నటి చెప్పులు.. హైహీల్స్ పై నిషేధం.. తక్కువ ఎత్తున్న బూట్లు.. సాండిల్స్ , బూట్లు ధరించరాదు.., ఎవరైనా సంప్రదాయ, సాంస్కృతిక డ్రెస్ వేసుకుంటే మధ్యాహ్నం 12లోపు వచ్చి రిపోర్ట్ చేయవాలి. అప్పుడు తీరిగ్గా చెక్ చేసి పంపిస్తారట.. ఇలా చిత్రవిచిత్రమైన నిబంధలను విద్యార్థుల పాలిట శాపంగా మారాయి.
ఈసారి నీట్ పరీక్షను ఎన్.టీ.ఏనే నిర్వహిస్తోంది. అత్యుత్సాహానికి పోయి.. కాపీ చేయడానికి వీలులేకుండా చిత్రవిచిత్రమైన నిబంధనలను సంస్థ పెట్టేసింది. దీంతో నిన్న మొదలైన నీట్ పరీక్షల్లో విద్యార్థులు ముప్పుతిప్పలు పడి మూడు చెరువుల నీళ్లు తాగారు.
నీట్ పరీక్ష సెంటర్ వద్ద అమ్మాయిలు ముక్కుపుడకలు తీస్తూ కనిపించారు. కొందరు ఉంగరాలు, చెవిపోగులు తీస్తూ కనిపించారు. మెడలో నెక్లస్, చైన్లు , బ్యాడ్జ్ లు, బ్రోచ్ లు, కాల్లకు మట్టెలు, ఒంటిపై ఎలాంటి లోహాలు లేకుండా తీస్తుండడం మీడియా కంట పడింది. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. విద్యార్థులకు ఇంతలా చీప్ రూల్స్ పెట్టడంపై అందరూ ఎన్ టీఏపై దుమ్మెత్తిపోశారు.
ఇక విద్యార్థులు పరీక్షకు తీసుకురాకుండా ఉండేందుకు చాలా పెద్ద జాబితానే నీట్ రూల్ బుక్ లో పొందుపరిచారు. ఇవన్నీ చూశాక ఉత్త చేతులతో వస్తే చాలు అనేలానే నిబంధనలున్నాయని విద్యార్థులు వాపోయారు.. చొక్కాలపై ఎక్కువ పాకెట్లు ఉన్న వారిని కూడా పరీక్షకు అనుమతించలేదు. ఇక మెడలో బంగారు ఆభరణాలను కూడా బాలికల చేత తీయించారు.
ఇలా నీట్ పరీక్షలో పరీక్ష పత్రం ఈజీగా వచ్చినా కానీ రాయడానికి వచ్చే విద్యార్థులకు మాత్రం చుక్కలు కనిపించాయి. ఆ కఠిన నిబంధనలకు చాలా మంది బెంబేలెత్తి తమ వస్తువులను ఎక్సామ్ సెంటర్ బయటే కుప్పలు కుప్పలుగా పడేయడం గమనార్హం. ఇప్పటికైనా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకొని పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఇంతటి కఠిన నిబంధనలు తొలగించాలని వారు కోరుతున్నారు.