రేవంత్ రెడ్డి దూకుడు.. పీసీసీ ఖాయమా?

Update: 2021-02-18 14:30 GMT
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పీసీసీ పీఠమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.  రైతాంగ, నిరుద్యోగ సమస్యలే ప్రధాన అజెండాగా   మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి పోరాడుతున్నారు. మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని పాదయాత్రకు శ్రీకారం చుట్టానని తెలిపారు.

మోడీ, కేసీఆర్ లు ఇద్దరూ జోడి కట్టారని రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం లేదని.. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటిస్తే సరిపోతుందని సూచించారు.

రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా యాక్టివ్ కావడానికి.. పాదయాత్రకు రూపకల్పన చేయడానికి పీసీసీ పీఠానికి గ్రీన్ సిగ్నల్ రావడమే కారణం అంటున్నారు. రేవంత్ కు పాదయాత్రలో మద్దతు చూశాక.. కాంగ్రెస్ నేతలు అంతా ఆయన వెంట ఉన్నారని.. పార్టీ నాయకులు కూడా ఆయన యాత్రకు సంఘీభావం ప్రకటించారని రేవంత్ అభిప్రాయపడ్డారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ పీసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పార్టీ నాయకులు పెద్దఎత్తున రేవంత్ రెడ్డికి మద్దత్తు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పీసిసి ఎవరికి దక్కుతుందో స్పష్టమైన సంకేతాలు అందుతున్న తరుణంలో రేవంత్ రెడ్డికి నాయకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్టు  పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News