బయటపడ్డ రేవంత్ రెడ్డి భూదందా వ్యవహారం!
గోపన్ పల్లి భూదందాపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో…. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి - ఆయన సోదరుడు కొండల్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. రేవంత్ రెడ్డి - కొండల్ రెడ్డి భూ అక్రమాలపై రెవెన్యూ అధికారుల విచారణ పూర్తికావడంతో, ఆర్డీవో చంద్రకళ నివేదికను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. గోపన్ పల్లిలోని సర్వే నెంబర్ 127లో రేవంత్ రెడ్డి - కొండల్ రెడ్డిలు అక్రమంగా భూ మ్యుటేషన్ లు - కబ్జాలకు పాల్పడినట్టు - అలాగే రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న10.20 ఎకరాల భూమి కూడా ఆక్రమించిందని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఓల్టా చట్టం ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదికలో అధికారులు పొందుపరిచారు.
అలాగే, దీనితో పాటు సర్వే నెంబర్ 127లనే 5.5 ఎకరాలకు టైటిల్ లేనట్టు గుర్తించారు. అక్రమంగా ఎకరం 36 గుంటల భూమిని మ్యూటేషన్ చేయించుకున్నట్టు తేల్చారు. ఓల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు రేవంత్ రెడ్డి - కొండల్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. రాజేంద్ర నగర్ ఆర్డీవో చంద్రకళ కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో తెలిపారు.
గోపన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో ఉన్న భూమిలో కొంత భాగాన్ని రేవంత్ రెడ్డి ఆక్రమించారని స్థానికులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఈ భూమిని ఓ వ్యక్తి నుంచి కొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని కొందరు - తమ పేరిట మ్యుటేషన్ చేసినందుకు డబ్బులిస్తామని చెప్పి రేవంత్ ఇవ్వలేదని కొందరు ఆరోపించారు. స్థానికులు కొందరు ఈ వ్యవహారంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. తర్వాత ఈ విషయంపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ - తప్పుడు పత్రాలు సృష్టించి - ఈ భూమి మ్యుటేషన్ జరిగిందని నిర్ధారించి సీఎస్ కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో గోపన్ పల్లి భూ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్న ఆరోపణలపై మళ్లీ ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం నిర్ణయించింది.ఇందులో భాగంగానే ఆర్డీవో చంద్రకళ మంగళవారం తన విచారణ నివేదికను కలెక్టర్ కు అందజేశారు.
కాగా పంచాయతీరాజ్ - ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గండిపేట సమీపంలో అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. దానిని ముట్టడించేందుకు సోమవారం ఆయన అనుచరులతో కలిసి అక్కడి చేరకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులకు, రేవంత్ కు పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది . దీంతో పోలీసులను రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి - కేటీఆర్ ల అక్రమ భూముల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.