కరోనా వ్యాక్సిన్ తయారుచేశాం ...ఇటలీ సంచలన ప్రకటన !

Update: 2020-05-06 09:50 GMT
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతున్న వేళ ఇటలీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవులపై పనిచేయగల కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది. తమ శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారుచేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ఇప్పుడు ప్రపంచదేశాల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

రోమ్ ‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో... ఈ వ్యాక్సీన్ ఎలుకల్లో యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ఇది మానవ కణాలపైనా సమర్థంగా పని చేస్తుందని ఇటలీ పరిశోధకులు చెబుతున్నారు. నోవల్ కరోనా వైరస్‌ వ్యాక్సీన్‌ కు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల్లో ఇదే అతిపెద్ద ముందడుగు అని దీన్ని తయారు చేస్తున్న టకిస్ సంస్థ సీఈవో లుయిగి ఆరిసిచియో తెలిపారు.

ఈ వేసవి తర్వాత మానవులపై పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఎలుకలకు ఒక్క డోస్ ఇవ్వగానే.. ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి చేసిందని, ఇది వైరస్‌ ను మానవ కణాలకు సోకకుండా నిరోధించగలదని అరిసిచియో అన్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్ ‌తో టకిస్ మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో తెలిపారు.కాగా,ఇటీలో కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటలీలో ఇప్పటి వరకు 213,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా,29,315మరణాలు నమోదయ్యాయి. 85,231మంది కరోనా నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
Tags:    

Similar News