అమెజాన్ తో రిలయన్స్ మెగా డీల్ @ 20 బిలియన్ డాలర్లు!

Update: 2020-09-11 06:30 GMT
వ్యాపార రంగంలో ముకేశ్ అంబానీ సంస్థ అయిన రిలయన్స్ రోజురోజుకి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదుగుతుంది. కరోనా కాలంలో కూడా అంబానీ సంస్థకి కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా రిటైల్‌ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించింది. ఈ–కామర్స్‌లో పోటీ సంస్థ అమెజాన్‌డాట్‌కామ్‌తో కూడా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌  లో 40 శాతం దాకా వాటాలను అమెజాన్‌కు విక్రయించేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. ఈ డీల్‌ విలువ సుమారు 20 బిలియన్‌ డాలర్ల మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆర్ ‌ఆర్ ‌వీఎల్ ‌లో ఇన్వెస్ట్‌ చేయడంపై అమెజాన్‌ ఆసక్తిగా ఉందని, దీనిపై చర్చలు కూడా జరిపిందని తెలిపారు.

ఈ డీల్ కుదిరితే ఇదే ఇప్పటివరకు దేశంలోనే అత్యంత భారీ డీల్‌ అవుతుంది అని  తెలిపాయి. అయితే, అమెజాన్‌ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయని, మరోవైపు, ఈ కథనాలపై మాట్లాడేందుకు రిలయన్స్, అమెజాన్‌ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్‌ ఎక్సే్చంజీలకు రిలయన్స్‌ ప్రకటించింది. కుదిరితే ఇది దేశంలోనే అత్యంత భారీ డీల్‌ కాగలదని తెలిపాయి. అయితే, అమెజాన్‌ ఇంకా పెట్టుబడుల పరిమాణంపై తుది నిర్ణయం తీసుకోలేదని, చర్చలు ఫలవంతం కాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయని, మరోవైపు, ఈ కథనాలపై మాట్లాడటానికి  రిలయన్స్, అమెజాన్‌ నిరాకరించాయి. మీడియా ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించలేమని స్టాక్‌ ఎక్స్ చేంజ్ లకు రిలయన్స్‌ తెలియజేసింది.

రిలయన్స్‌ రిటైల్‌లో అమెరికాకు సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌ 1.75% వాటా కోసం రూ. 7,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే అమెజాన్‌కి వాటాల విక్రయం తెరపైకి వచ్చింది. రిలయన్స్‌  ఇటీవలే ఫ్యూచర్‌ గ్రూప్‌  రిటైల్‌ వ్యాపారాన్ని రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారంలో అమెజాన్‌ ఇన్వెస్టరుగా ఉంది.  కాగా ఇటీవలే రిలయన్స్‌ జియోలో 13 విదేశీ సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థలన్నింటికీ, రిలయన్స్‌ రిటైల్‌ లో కూడా ఇన్వెస్ట్‌ చేసే ఆఫర్‌ లభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
Tags:    

Similar News