అమెజాన్ కు ఊరట..రిలయన్స్ ఫ్యూచర్ గ్రూపును కొనుగోలు చేయకుండా ఆదేశాలు

Update: 2020-10-26 09:50 GMT
ఫ్యూచర్ గ్రూపు కొనుగోలుకు ప్రయత్నించిన రిలయన్స్ కు అమెజాన్ షాకిచ్చింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ సింగపూర్ లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ)కు విన్నవించగా అందుకు  సానుకూలంగా స్పందించింది. ఈ  ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో  అమెజాన్‌కు భారీ ఊరట లభించినట్లయింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ కంపెనీ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) కిషోర్‌ బియానీ ప్రమోటింగ్ కంపెనీ ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలుకు ప్రయత్నించింది.

 ఇందుకోసం  ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాల కొనుగోలుకు 24,713 కోట్లు రూపాయల ఒప్పందం చేసుకుంది. అయితే అంతకుముందే  ఫ్యూచర్‌ గ్రూప్‌ తమతో కుదుర్చుకున్న ఒప్పందానికి రిలయన్స్ చేసుకున్న డీల్‌ విరుద్ధమైనదంటూ అమెజాన్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో  ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌కు ఈ విషయమై లీగల్ నోటీసులు పంపించింది. రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్‌ డీల్ ని నిలిపి వేయాలని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ)ను అమెజాన్ అభ్యర్థించింది. దీనికి  సానుకూలంగా స్పందించిన ఎస్ఐఏసీ  ఈ  ఒప్పందాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో అమెజాన్‌కు  తాత్కాలిక ఊరట లభించగా  ఫ్యూచర్ గ్రూపు కొనుగోలుకు ప్రయత్నించిన రిలయన్స్ కంపెనీకి చుక్కెదురైంది.
Tags:    

Similar News