ఆఫీస్ స్పేస్ కు తగ్గిన డిమాండ్ !
కరోనా మహమ్మారి విజృంభణ .. ఆ తరువాత కేంద్రం విధించిన లాక్ డౌన్ తో దేశంలోని దాదాపుగా అన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. కొన్ని సంస్థలు ఈ ఏడాది ఇక ఆఫీస్ తెరవబోము అని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కారణంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా కార్పొరేట్ కంపెనీలు, ఇతర కంపెనీలు అనేక తమ సంస్థల విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 50 శాతం పడిపోయి 54 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ జెఎల్ ఎల్ ఇండియా తెలిపింది.
కరోనా నేపథ్యంలో కార్పొరేట్స్, కో–వర్కింగ్ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికల వాయిదాతోపాటు వర్క్ ఫ్రమ్ హోం విధానమూ ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్ లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 64% వృద్ధి సాధించింది. ఈ 7 నగరాల్లో 2019 జనవరి–సెప్టెంబరులో పలు కంపెనీలు కార్యాలయాల కోసం కొత్తగా అద్దెకు తీసుకున్న స్థలం 3.27 కోట్ల చదరపు అడుగులు. ఈ ఏడాది ఇది 47% తగ్గి 1.73 కోట్ల చదరపు అడుగులకు చేరింది. ప్రస్తుత ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో 2.72 మిలియన్ చదరపు అడుగుల నికర లీజింగ్ తో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్ 1.54 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు ఇచ్చినట్టు జేఎల్ ఎల్ ఇండియా వెల్లడించింది.
ఇక ఈ జాబితాలో పూణె 0.46 మిలియన్ చదరపు అడుగులు, ముంబై 0.28 మిలియన్ చదరపు అడుగులతో, చెన్నై 0.21 మిలియన్ చదరపు అడుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రెండో క్వార్టర్‌తో పోలిస్తే మూడో క్వార్టర్‌లో కార్యాలయాల అద్దెలు బెంగళూరులో స్వల్పంగా పెరగగా, మిగిలిన ఆరు నగరాల్లో స్థిరంగా ఉన్నట్లు జేఎల్ ఎల్ తెలిపింది. కరోనా విజృంభణ కారణంగా కార్పొరేట్ సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని, విస్తరణ ప్రణాళిక్లను ఆలస్యం చేస్తున్నందున ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకునే వారు ఆసక్తి చూపించడంలేదని, పరిస్థితులు సానుకూలంగా లేనందున ఆఫీస్ స్పేస్ డిమాండ్ మరికొన్నాళ్లు ప్రతికూలంగానే ఉండొచ్చని జేఎల్ ఎల్ ఇండియా అభిప్రాయ పడింది.