అమెరికాలో రికార్డ్ స్థాయిలో ముందస్తు ఓటింగ్ ... వెనుక బడ్డ ట్రంప్ !

Update: 2020-10-31 15:30 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020పై ప్రపంచంలో దాదాపు అన్ని  దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటే పలు ఇతర దేశాలు ఓ కన్నేసి ఉంచుతాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 లో భాగంగా నిర్వహిస్తున్న ముందస్తు పోలింగ్‌ లో భారీ శాతం ఓటింగ్ నమోదు అవుతుంది. రికార్డు స్థాయిలో 80 మిలియన్లు (8 కోట్లు) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. 2016తో పోల్చితే ప్రస్తుతం జరుగుతున్న ముందస్తు పోలింగ్ చాలా అధికమని అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కరోనా మహమ్మారి అనే తెలుస్తుంది. కరోనా మహమ్మారి అమెరికాలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో చాలామంది ముందుగానే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీనితో భారీగా ఓటింగ్ జరుగుతుంది.

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికల బరిలో ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి పోటీ ఇస్తున్నారు. ముందస్తు ఎన్నికల్లో ట్రంప్ కంటే , బిడెన్ ముందంజ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే , వీటి ఆధారంగా ఫలితాలని అంచనా వేయడం కుదరదు.

ఇకపోతే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో 150 మిలియన్ల మంది (15 కోట్లు) ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన అంచనా వేశారు. దాదాపు 65శాతం పోలింగ్ నమోదు కానుందని, 1908 తర్వాత ఇదే అత్యధిక శాతం ఓటింగ్ కానుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో  టెక్సాస్ ఓట్లు కీలకం కానున్నాయి. 2016లో నమోదైన మొత్తం ఓట్లలో ఇప్పటికే 82శాతం పోలింగ్ జరిగింది. 7.4 మిలియన్ల టెక్సాస్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 3 న జరగబోతుంది. 
Tags:    

Similar News