దీక్షలో భాగమే పవన్‌ గడ్డమా?

Update: 2015-05-23 10:47 GMT
ఆ మధ్యన ఏపీ రాజధాని ప్రాంతంలో రైతుల కష్టాలు తెలుసుకునే సమయంలోనూ.. ఈ మధ్యన మంచు వారింట జరిగిన మనోజ్‌ పెళ్లి వేడుకకు పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బవిరి గడ్డంతో హాజరు కావటం అందరిని ఆకర్షించింది.

కనీసం ట్రిమ్‌ చేయకుండా భారీగా పెంచేసిన బవిరి గడ్డం కథ ఏమిటన్నది చాలామందిలో సందేహం రేకెత్తిస్తోంది. దీనికి చాలామంది చెప్పిన మాటేమిటంటే.. గబ్బర్‌సింగ్‌ 2 సినిమాలో భాగంగా ఈ భారీ గడ్డం అవసరమైందని చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా పవన్‌ గడ్డం గురించి సరికొత్త మాట వినిపిస్తోంది.

పవన్‌కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు కమ్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సలహాతోనే పవన్‌ గడ్డం పెంచుతున్నారని చెబుతున్నారు. త్రివిక్రమ్‌.. విశ్వంజీ అనే స్వామీజీని విపరీతంగా నమ్ముతారట. ఆయన్ను పవన్‌కల్యాణ్‌కు త్రివిక్రమ్‌ పరిచయంచేయటం.. ఆయన సలహాతోనే ఇంత భారీ గడ్డాన్ని పెంచుతున్నారని చెబుతున్నారు.

దీక్షలో భాగంగా పవన్‌ గడ్డం పెంచుతున్నారన్న మాట వినిపిస్తోంది. 42 రోజుల పాటు సాగే దీక్ష కోసం గడ్డం పెంచుతున్నట్లు చెబుతున్న మాటనే విశ్వాసంలోకి తీసుకుంటే.. రాజధాని భూముల కోసం పవన్‌ కల్యాణ్‌ పర్యటించి 42 రోజులు దాటిపోయింది. మరి.. పరిమిత కాలందీక్ష కోసం అయితే.. ఇప్పటికే గడ్డం తీసేయాలి? మరి.. పవన్‌ ఇంకా గడ్డం తీయకుండా మరింత పెంచేయటం ఏమిటి?

పవన్‌కల్యాణ్‌ గడ్డం మీద వినిపిస్తోన్న వాదనల విషయంలో పరస్పర విరుద్ధమైన కథనాలు వినిపిస్తున్నాయి. పోనీ.. పవన్‌నే నేరుగా అడిగేద్దామంటే.. ఆయనేమో మీడియాకు దూరంగా ఉంటూ తన పని తాను అన్నట్లు ఉంటారు. మీడియాకు నేరుగా సమాచారం ఇవ్వకున్నా.. ట్విట్టర్‌ ట్వీట్‌ ద్వారా.. తన గడ్డం కథను కాస్తంత షేర్‌ చేసుకుంటే.. ఆయన్ను అమితంగా ఆరాధించే వారి మనసుకాస్తంత కుదుట పడుతుంది కదా..?
Tags:    

Similar News