వైసీపీ ఆటలో.. 'రావి రామనాథం' అరటి పండేనా?!
రావి రామనాథం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కాకుండా.. సీమ ప్రాంతంలో ఈ పేరు , మనిషి కూడా బాగా సుపరిచితులు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రావి.. విత్తనాలు, ఎరువుల వ్యాపారి. డిస్ట్రిబ్యూషన్ చేస్తుం టారు. అయితే.. ఈయన ఇప్పుడు రాజకీయంగా మరోసారి చర్చకు వచ్చారు. వాస్తవానికి తన మానాన తను వ్యాపారం చేసుకుంటే.. అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి తీసుకువచ్చారు కొందరు వైసీపీ నాయకులు.
అంతేకాదు.. వస్తూ వస్తూనే.. ఆయనకు 2018లో కీలకమైన పరుచూరు నియోజకవర్గం బాధ్యతలు అప్పగిం చారు. పరుచూరు అంటే టీడీపీకి కంచుకోట. అదేసమయంలో కమ్మ వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో రావికిబాధ్యతలు అప్పగించిన అప్పటి విపక్ష నాయకుడు జగన్.. పార్టీ తరఫున పోటీ చేసేది నువ్వేనన్నా!! అని హామీ కూడా ఇచ్చారు. దీంతో ఇంకేముంది.. తన సొమ్ము.. పూర్తిగా ఖర్చు పెట్టి.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఇంతలోనే ఎందుకనో.. చంద్రబాబు తోడల్లుడు.. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే.. అనూహ్యంగా పరుచూరు టికెట్‌ను దగ్గుబాటి కుమారుడు చెంచురామ్‌కు ప్రకటిం చారు. అయితే.. అమెరికా నుంచి రావడం.. చెంచురామ్ కు కుదరలేదు. దీంతో దగ్గుబాటి పోటీ చేశారు. ఓడిపోయారు. ఈ క్రమంలోతనను అవమానించారంటూ.. రావి సైకిల్ ఎక్కారు. అయితే.. అక్కడ ఏ టికెట్ కు అవకాశం లేకపోవడంతో మళ్లీ వైసీపీ గూటికి చేరారు.
ఇక, గత ఎన్నికల్లో ఓడిపోయిన.. దగ్గుబాటి.. వైసీపీకి దూరంగా ఉండడంతో మళ్లీ రావికి పరుచూరు పగ్గాలు ఇచ్చారు. ఇంకేముంది.. ఇంక తనకు తిరుగులేదని భావించిన రావి.. దూకుడుగా కార్యక్రమాలు చేస్తున్నా రు. 2024 ఎన్నికల్లో తన గెలుపును రాసిపెట్టుకోవచ్చని ఆయన భావించారు. అయితే.. ఇదేం ఖర్మో.. తెలియదు కానీ రావికి మళ్లీ వైసీపీ చెక్ పెట్టేసింది. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్‌ను పరుచూరుకు పంపేసింది. దీంతోమళ్లీ రావి డమ్మీ!! ఈ పరిణామాలను గమనిస్తే.. వైసీపీ ఆటలో రావి అరటిపండు అయిపోయారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.