ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్.. దేశం మొత్తం మీద ఒకే ఒక్కడు..
మనిషి సజీవంగా జీవించాలంటే ఎన్నో రకాల జీవక్రియలు సమన్వయంతో జరగాలి. మన శరీరంలోని ప్రతి భాగం కూడా ముఖ్యమైనదే దాని పని అది సక్రమంగా చేసినప్పుడు మాత్రమే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలడు. అందుకే ఏ ఒక్క అవయవం పనిచేయలేకపోయినా మనం అనారోగ్యానికి గురవుతాం.
మన శరీరంలోని అన్నింటికన్నా ముఖ్యమైనది రక్తం.. ఊపిరితిత్తులలోని గాలి నుంచి ఆక్సిజన్ ను సేకరించి శరీరంలోని అన్ని కణాలకు అందించడమే రక్తం ప్రధాన కర్తవ్యం. అంతేకాదు.. శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ ను కూడా కణాల నుంచి తొలగింస్తుంది. ఒక పరిశోధన ప్రకారం మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే ఐదు లీటర్ల రక్తం అవసరం. ఐతే మనుషుల్లో అనేక రకాల రక్త సమూహాలు ఉంటాయి.
మానవ జాతిలో ప్రధానంగా , A, B, AB, O పాజిటివ్ నెగెటివ్ రక్త గ్రూపులు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకో బ్లడ్ గ్రూప్ కూడా ఉంటుంది. అది చాలా అరుదుగా ఉండే ‘ఈ’ బ్లడ్ గ్రూప్ గురించి చాలా మందికి తెలియదు.. ఈఎంఎం బ్లడ్ గ్రూప్ గా దీన్ని పరిశోధకులు గుర్తించారు.
ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపును భారత్ లో పరిశోధకులు గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ కు చెందిన 65 ఏళ్ల వ్యక్తిలో ‘ఈఎంఎం నెగెటివ్’ చెందిన రక్తపు గ్రూపును వైద్యులు కనుగొన్నారు. అలాంటి బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే పది మందికి మాత్రమే ఉంది.అలాంటి రక్తపు గ్రూప్ గల పదో వ్యక్తిగా గుజరాత్ వ్యక్తి రికార్డ్ సృష్టించాడు.
భారత దేశం మొత్తం మీద ఈఎంఎం బ్లడ్ గ్రూపు గుజరాత్ వ్యక్తికి మాత్రమే ఉంది. అన్ని రక్తగ్రూపుల్లో 42 రకాల వ్యవస్థలుంటే ఈఎంఎంలో 375 రకాలుంటాయి. ఈ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులు ఇతరులకు రక్తం దానం చేయడం.. ఇతరుల రక్తం స్వీకరించే అవకాశం ఉండదు.
గుజరాత్ కు చెందిన ఈ వ్యక్తికి గుండె సమస్య వచ్చింది. దీనికి సర్జరీ కోసం చేసిన రక్తపరీక్షల్లో ఈయనది అరుదైన బ్లడ్ గ్రూప్ అని బయటపడింది. దీనికి ఈఎంఎం నెగెటివ్ అని నామకరణం చేశారు. ఇతడి బ్లడ్ గ్రూప్ దేంతోనే మ్యాచ్ కాకపోవడంతో పరీక్షల కోసం అమెరికాకు పంపగా.. ఇది అరుదైన ఈఎంఎం బ్లడ్ గ్రూప్ గా తేలింది.