టార్గెట్ విజయసాయిరెడ్డి.. ఎందుకు వర్కవుట్ కాలేదు

Update: 2020-09-08 04:00 GMT
అధికారంలో ఉన్న వారిపై ఏదోలా బురద జల్లాలన్న తీరు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి హడావుడి చేయటం.. తద్వారా వార్తల్లో నిలవటం తెలిసిందే. అలాంటి వాటికి తాత్కాలికంగా అందరిని ఆకర్షించినా.. నిజం నిలకడ మీద బయటకు వస్తుందన్న విషయం తాజాగా మరోసారి రుజువైంది. లాభదాయక పదవుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారంటూ వేసిన పిటిషన్ పై రాష్ట్రపతి కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఢిల్లీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి రెడ్డి లాభాదాయక పదవిలో ఉన్నారంటే బీజేపీ నేత సీహెచ్ రామకోటయ్య కంప్లైంట్ చేశారు. ఓవైపు రాజ్యసభకు ఎంపీగా వ్యవహరిస్తూ.. మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి పదవిలో ఎలా ఉంటారన్నది ఆయన క్వశ్చన్. అందుకే.. రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

తన ముందుకు వచ్చిన పిటిషన్ ను పరిశీలించి.. రాష్ట్రపతి ఈ వాదనలో పస లేదని తేల్చారు. ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎలాంటి జీతభత్యాలు తీసుకోవటం లేదని.. అందుకే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఈ ఉదంతాన్ని పరిగణించలేమని తేల్చారు. ఈ కారణంతోనే ప్రిపెన్షన్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ యాక్ట్ వర్తించదని ఎన్నికల సంఘం తేల్చింది.

దీంతో.. ఆయనపై వచ్చిన పిటిషన్ ను కొట్టివేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి లాంటి నేతను టార్గెట్ చేయాలన్న తహతహ బీజేపీ నేతకు ఉన్నప్పుడు.. ప్రాథమిక విషయాల్ని సైతం పరిగణలోకి తీసుకోకుండా.. పిటిషన్లు దాఖలు చేసి అభాసు పాలు కావటం ఏమిటి? అన్నది ప్రశ్న. లాభదాయక పదవుల్లో ఉన్నారన్నప్పుడు.. సదరు పదవి కారణంగా ఆర్థికంగా ఎంత లాభం చేకూరుతుందన్న విషయాన్ని కూడా చెక్ చేయకుండా పిటిషన్లు దాఖలు చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది మరి.
Tags:    

Similar News