వ‌ర్మ సంచ‌ల‌నం!.. అజ్ఞానం గుడ్డ‌లూడ‌దీస్తార‌ట‌!

Update: 2018-02-25 09:08 GMT
బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాంగోపాల్ వ‌ర్మ ఏమాత్రం సైలెంట్‌ గా ఉండేట్లు క‌నిపించ‌డం లేదు. గాడ్‌ - సెక్స్ అండ్ ట్రూత్ పేరిట ఓ వెబ్ సిరీస్ చిత్రాన్ని తీసిన వ‌ర్మ‌...దానిని విమియో వెబ్ సైట్‌ లో విడుద‌ల చేసిన పెద్ద సంచ‌ల‌న‌మే రేపారు. అంతా సెక్స్ చుట్టే తిరిగిన ఈ చిత్రంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఎంత చూపించాలో అంతా చూపించిన వ‌ర్మ‌... అందులో త‌ప్పేముంద‌ని కూడా ఓ కొత్త వాద‌న చేశారు. కేవ‌లం చిత్రాన్ని తీయ‌డం - దానిని విడుద‌ల చేయ‌డంతోనే త‌న ప‌ని అయిపోయిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ని వ‌ర్మ‌... ఆ చిత్రంపై ప‌లు టీవీ ఛానెళ్లు నిర్వ‌హించిన‌ చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రై మ‌హిళా సంఘాల నేత‌ల‌పై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. మ‌హిళా సంఘం నేత ప‌ద్మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వ‌ర్మ‌... అస‌లు త‌న వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమీ లేద‌న్న‌ట్లుగా కూడా త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల ఫ‌లితంగా వ‌ర్మ‌పై కేసు న‌మోదు కావ‌డ‌మే కాకుండా... ఏకంగా మ‌హిళా లోకాన్ని కించ‌ప‌రిచేలా జీఎస్డీ ఎందుకు తీశారంటూ పోలీసులు ప్ర‌శ్నించే దాకా విష‌యం వెళ్లిపోయింది. ఇప్ప‌టికే హైద‌రాబాదు సీసీఎస్ పోలీసుల ఎదుట‌ ఓ ద‌ఫా విచార‌ణ‌కు హాజ‌రైన వ‌ర్మ‌... మ‌రో ద‌ఫా కూడా విచార‌ణ‌కు త‌ప్ప‌నిస‌రిగానే హాజ‌రుకావాల్సి ఉంది.

తొలి ద‌శ విచార‌ణ సంద‌ర్భంగా వ‌ర్మ‌కు చెందిన ల్యాప్‌ టాప్‌ ను స్వాథీనం చేసుకున్న పోలీసులు... మ‌లిద‌ఫా విచార‌ణ‌లో వ‌ర్మ‌కు దిమ్మ తిరిగే క్వ‌శ్చ‌న్లే సిద్ధం చేస్తున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి పొద్దు పోయిన త‌ర్వాత ట్విట్ట‌ర్ వేదిక‌గా రంగంలోకి దిగిన వ‌ర్మ‌... మ‌హిళ‌లు - మ‌హిళా స్వేచ్ఛ‌ - జీఎస్డీ... ఇలా అన్నింటినీ ముడిపెట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌రుస ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డ వ‌ర్మ‌... ఏకంగా మ‌హిళా సంఘాల నేత‌ల‌కు పెద్ద స‌వాలే విసిరి సంచ‌ల‌నం రేపార‌నే వాద‌న వినిపిస్తోంది. మార్చి 8 ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని సార‌గ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా ఓ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన వ‌ర్మ‌... ఆ స‌ద‌స్సుకు అంద‌రూ హాజ‌రుకావాలంటూ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న చిత్రం జీఎస్టీని ఆకాశానికెత్తేసిన వ‌ర్మ.... అదే స‌మ‌యంలో త‌న చిత్రాన్ని విమ‌ర్శిస్తున్న వారిని అజ్ఞానులుగా అభివ‌ర్ణించారు. అంతేకాకుండా విశాఖ కేంద్రంగా నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో ఆ అజ్ఞానం బ‌ట్ట‌లూడ‌దీసేస్తాన‌ని - స‌రైన కోణంలో ఆలోచించేలా ప్రాప‌ర్ డ్రెస్సింగ్ నేర్పుతాన‌ని కూడా వ‌ర్మ త‌న‌దైన స్టైల్లో స్టేట్ మెంట్లు ఇచ్చారు. మొత్తంగా స‌ద‌రు ట్వీట్ల ద్వారా ఆరిపోయింద‌నుకుంటున్న జీఎస్టీ నిప్పును వ‌ర్మ తిరిగి రాజేస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విశాఖ స‌ద‌స్సు, టీవీ9 త‌న‌పై చేస్తున్న దుష్ప్ర‌చారాల‌కు సంబంధించి ఫేస్ బుక్ వేదిక‌గా ఓ సుదీర్ఘ  వాద‌న‌ను రాసేసిన వ‌ర్మ‌... దానిని త‌న ట్వీట్ల‌కు త‌గిలించేశారు. ఆ ఫేస్ బుక్ పోస్ట్ కింది విధంగా సాగింది.  

స్త్రీ స్వేచ్చా సమావేశం
—రామ్ గోపాల్ వర్మ

స్త్రీ స్వేచ్చ గురించి - భావజాల స్వేచ్చ గురించి విశాఖపట్నంలో బహిరంగ మీటింగ్ కి నా పిలుపు. మరియు Tv 9 చానెల్ లో నా మీద జరుగుతున్న దుష్ప్రచారానికి నా సమాధానం.

- రామ్ గోపాల్ వర్మ

ఏ అఫిషియల్ రుజువులు లేకుండా ఒకరు తప్పు చేశారని ఫిక్స్ అయ్యి - దాని సపోర్ట్ కి గాను చాలా మందిని రెచ్చగొట్టి వాళ్ళతో నానా మాటలూ అనిపించి, వాళ్ళ ఘర్షణలని TRP రేటింగుల కోసం వాడుకోవటం TV9 ఆనవాయితీ అని రాష్ట్రంలో అందరికీ తెలుసు.

వ్యక్తిగతంగా ఒక మహిళకి ప్రమేయం ఏమీ లేకుండా ఏకపక్షంగా "నీతో ఫలానా సినిమా తీస్తా" అని ఏ విధంగా , ఏ సందర్భంలో అని వుంటాను?

ఈ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మీకర్దమౌతుంది.
youtu.be/Hl-StXn5eQQ

నా మామూలు పద్దతిలో ఇంటర్వ్యూ మొత్తం సరదా సరదాగా మాట్లాడుతూ ఉంటే, కేవలం ఆ ఒక్క బిట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ రెపీట్ చేస్తే దేని పెర్స్పెక్టివ్ అయినా మారిపోతుంది.

ఆ వ్యాఖ్యలకి ముందు ఏమన్నానో తర్వాత ఏమన్నానో చూడండి. ముఖ్యంగా యాంకర్ కూడా సరదాగా తీసుకోవడం గమనించండి.
4

"మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చెయ్యదలచుకున్నారు ? గురజాడగారు ఏమన్నారో తెలుసా ? మంచి అన్నది పెంచుమన్న అన్నారు మణిగారు.

పాయింట్ ఏమిటంటే మణిగారు ఒక సంస్థకి ప్రతినిధి.. నేనేమీ అనకముందే నన్ను పర్వర్టెడ్ - మెంటల్ - సైకో అన్నారు.
ఆవిడ ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి తెలియక మాట్లాడుతున్నారు అని నేను అనుకోవాలా?

పైగా ఆవిడ లైవ్ లో కూడా లేరు..... అది రికార్డెడ్ వీడియో.

అంటే ఆవిడతో ఏమనిపిస్తే నేనిలా రియాక్ట్ అవుతానన్న స్కెచ్ అంతా TV9 దే అనుకోవాలా?

నా గురించి తెలిసుండీ - ఏళ్ల తరబడి నా అభిప్రాయాలు విని ఉండి కూడా ఆవిడ అలాంటి లెక్చర్లు ఇస్తే ఇక నేను సంయమనం కోల్పోనా?

కానీ నేను మరీ అంతగా ఎందుకు ఓవర్ రియాక్ట్ అయ్యాను.??

నేను 30 ఏళ్ళుగా రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీస్తున్నాను. .

నాకు సామాజిక బాధ్యత కన్నా నేను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యిన వాటిగురించే నా సినిమాల ద్వారా రెస్పాండ్ అవుతాను.

నేను కేవలం ఈ దేశ చట్టాలను - రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవిస్తాను అని ప్రతి ఇంటర్వ్యూ లో కొన్ని వందలసార్లు చెప్పాను. అలా నిన్న మొన్న కాదు గత 30 ఏళ్లుగా చెపుతూనే ఉన్నాను.

అటువంటి నా దగ్గర ’గురజాడ ఏమన్నాడో తెలుసా మంచి అన్నది పెంచుమన్న" అని నీతి బోధలు చేస్తే ఎలా ఉంటుంది? "మంచి" అనే దాని యొక్క డెఫినేషన్ నా బుర్రకి వేరు - మణిగారి బుర్రకి వేరు

కొన్ని లక్షల పోర్న్ వీడియోలు 20 ఏళ్లుగా భారతీయులందరికీ అందుబాటులో ఉన్నా యే మాత్రం పట్టించుకోని వీళ్ళు (పైగా వీటిలో ఎన్నో - ఇండియన్ అమ్మాయిలు అబ్బాయిలవి) - పోర్న్ మూవీ కానీ GST ఒక్కదాన్నే టార్గెట్ చెయ్యడంలోని అర్దం ఆ గొడవ చేస్తున్నవాళ్ళకే తెలియాలి... పోర్న్అనేది బై డెఫినిషన్ సెక్స్ చేసుకునే దృశ్యాలు ఉండటం....

నేను GST ఒక ఫీలోసోఫికల్ ట్రియటైస్ అని చెప్తూ ఉంటే - అది పోర్న్ అని ఫిక్స్ అయిపోయి మొత్తమందరికి అది పోర్న్ అని చాటి చెప్పి పోర్న్ ని ఇంకా పాపులర్ చేసింది Tv 9

GST లో కేవలం నగ్నంగా ఉన్న,అది కూడా ఒక అమెరికన్ అమ్మాయి సెక్స్ గురించిన తన ఫీలోసోపి చెప్తుంది.

పోర్న్ కి నేను తీసిన GST కి తేడా తెలియాలంటే ఈ ప్రఖ్యాత సోషల్ సైకోలోజీస్ట్ వీడియో చూడండి.
youtu.be/aPgz49RGdRE

సరే , అసహనానికి లోనయ్యి సంయమనం కోల్పోయి మాటతూలిన నేను ఆ తర్వాత అపాలజీ చెప్పాను. కానీ నిజానికి మహిళా ప్రతినిధులమని చెప్పుకునే ఆ చాలామంది మహిళలు నన్ను చట్ట వ్యతిరేకంగా ఎంకౌంటర్ చేసి చంపేయ్యాలని, నరబలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.... దానికి నేను వాళ్ళ మీద కేసులు పెట్టలా?

వాళ్ళు నన్ను అన్న మాటలకి, నేను వాళ్ళనన్న మాటలకి ఉన్న విపరీతమైన తేడా ఎవరికైనా అర్ధమవుతుంధి ఈ వీడియో చూస్తే.
www.youtube.com/watch?v=YaJwv0Scm0M

నా అభిప్రాయాలు ఎలాంటివైనా నేను దేశపు చట్టాన్ని గౌరవిస్తాను.... నేను GST నాకర్ధమైన చట్టాల పరిధిలోనే తీశాను..... అలా కాదని రుజువైననాడు ఆ చట్టం తీసుకునే చర్యలని ఫేస్ చెయ్యడానికి ఈ దేశపు పౌరుడిగా సిద్దంగా ఉన్నాను.

నేనెక్కడ తీశాను, ఎప్పుడు తీశాను అనే టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారుగానీ నేనే నా నోటితో GST నేనే తీశానని ఎన్నోసార్లు చెప్పడమే కాకుండా నా పేరు పెద్ద పెద్ద అక్షరాలతో వీడియొ స్క్రీన్ మీద కూడా వెయ్యడం జరిగింది. దాని తరువాత నేను తియ్యలేదని చెప్తున్నాను అని చేసే తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడంలో అర్ధమేమిటి?

Film industry drug scandal గురించి 20 రోజులు non stop అరిచిన తర్వాత చివరికి ఏమైందనే సంగతి అందరికీ తెలిసిందే

GSTలో నేను చెప్పిన రివొల్యూషనరీ సెక్సువల్ ఫిలాసఫి ఈస్ in the context of a terrible suppression of women’s sexual freedom across the centuries

ఇవాళ ఆ స్త్రీ స్వాతంత్ర్యల గురించి మాట్లాడేవాళ్ళ కన్నా నాకు ఆ టాపిక్ మీద చాలా ఎక్కువ అవగాహన ఉంది. I have been a voracious reader of each and every philosophy written in the entire world .... నేను వాటిల్లోనుంచి సంపాదించిన నా జ్నానంలో నుంచి వచ్చిన, నేను నమ్మిన నా నమ్మకాల కోసం జీవిస్తాను...

నాకెదురయ్యే ప్రతి పరిణామాలకి నేనే పూర్తి బాధ్యత తీసుకుంటూ 1దాని ద్వారా వచ్చే కష్టనష్టాలని ఎదుర్కుంటూ, నా జీవితాన్ని అన్నిరకాలుగా అనుభవిస్తూ చచ్చే వరకూ నా దారిలోనే నేను వెళ్తూనే ఉన్నాను ........ వెళ్తూనే ఉంటాను.

నన్ను అరెస్ట్ చెయ్యమని జైల్లో పెట్టమని మాటిమాటికి డిమాండ్ చేస్తున్నవాళ్ళందరికీ నాదొక్కటే సమాధానం.

నేను డబ్బులున్నా - లేకపోయినా - నా ఆఫీస్ చెట్టు కిందున్నా - భవంతిలో ఉన్నా - నేను బయటున్నా - జైల్లో ఉన్నా నాకేం డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నేను కేవలం నాఆలోచనల్లో బ్రతుకుతాను...... నా బాడీ ఎక్కడుందనేది నాకు పాయింటే కాదు.

బయటుండి జైళ్లలాంటి మనసులతో బతికేకన్నా - జైల్లో ఉండి స్వేచ్చా ఆలోచనలతో బతకడం 1000 రెట్లు బెటర్.

చివరి మాటగా నేను చెప్పేది - ఎవరేమన్నా,ఎవరేమనుకున్నా నేను నమ్మే నా అభిప్రాయాలకోసం నేను బ్రతుకుతున్నాను. అలా బ్రతకలేని రోజున చస్తాను కానీ నా రూట్ మాత్రం నేను మార్చుకొను.

“An active minority becomes visible and the silent majority suffers in darkness” అన్నారు జార్జ్ బెర్నార్డ్ షా... నేను చెప్పేది సపోర్ట్ చేస్తున్నవాళ్ళందరూ సైలెంట్ గా ఉండటం మూలాన దీనిని ప్రతిఘటిస్తున్నవాళ్ళుమాత్రమే మొత్తం దేశానికి ప్రతినిధులనుకునే ప్రమాదముంది. ..

ఈ సెల్ఫ్ అపాయింటెడ్ మోరల్ ప్రతినిధులమనుకునేవాళ్ళకి అందరూ వాళ్లలాగానే ఆలోచించరని తెలియచెప్పటానికి వాళ్ళకి వాళ్ళు మీటింగులు పెట్టుకున్నట్టే నా లాగా ఆలోచించేవాళ్లు ఎవరున్నా మనమందరమూ కూడా కలిసి March 7 న విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకుందాం.

అదే టైమ్ లో ప్రొటెస్టర్స్ ని కూడా మీటింగ్ పెట్టుకొమ్మని నా ఛాలెంజ్. ఏ మీటింగ్ కి ఎక్కువమంది వస్తారో పూర్తి నిజం ఒక్క దెబ్బతో తెలిసిపోతుంది.

నా మీటింగ్ కి యువత - కాలేజ్ స్టూడెంట్లు - గృహిణులు - నా రాముఇజం సిరీస్ చూసినవాళ్లు - నా ఆలోచనలతో ఏకీభవించే అందరూ ఆహ్వానితులే. మీడియా అందరికీ ఆ మీటింగ్ కి రమ్మని ఇదే నా ఇన్విటేషన్ - Tv 9 గారు దమ్ముంటే వచ్చి ఆ మీటింగ్ కవర్ చేయండి.

“Regressive thoughts will prevail in the absence of not shouting out the progressive thoughts” అన్నారు అయాన్ రాండ్.

Silent gaa ఉంటే అరుపులే నిజమనుకుంటుంది ఈ లోకం....... అందుకని మనం కూడా అరవాల్సిన టైమ్ వచ్చింది.

నా స్త్రీ స్వేచ్చా మీటింగ్ కి వైజాగ్ వచ్చి నాతో గొంతు కలుపుతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు రావాల్సిన అవసరముంది.... ఇది నా కోసం కాదు, మీ భవిష్యత్తు కోసం, మీ స్వేచ్చ కోసం, రిగ్రెస్సివ్ థింకింగ్ నుంచి ప్రోగ్రెస్సివ్ థింకింగ్ లోకి వెళ్లాల్సిన మీ అవసరం కోసం.

Let us all meet in Vishakapatnam on March 7th to demonstrate the power of GOD’s TRUTH behind UGLY LIES

VENUE and TIME will be told soon
#WomenPower

“Honest people remaining silent makes dishonesty Shout from the roof tops” -Voltaire

--- రామ్ గోపాల్ వర్మ


Tags:    

Similar News