'రజనీ పార్టీ, ఆటో గుర్తు ' అన్నీ పుకార్లే.. మక్కల్ మండ్రం క్లారిటీ!
నిన్నంత తమిళనాడు లో సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పేరు, సింబల్ ఇదేనంటూ తెగ హంగామా జరిగింది. సోషల్ మీడియా తో పాటు ప్రధాన మీడియా కూడా ఈ వార్తను హైలెట్ చేస్తూ హోరుమని పించారు. కానీ అసలు విషయం తెలిసిన తర్వాత అభిమానులు ఉసురు మన్నారు. డిసెంబర్లో స్వయంగా రజనీకాంత్ పార్టీ పేరు, ఇతర వివరాలు చెబుతారని అప్పటివరకు అభిమానులు సంయమనం పాటించాలని రజనీ మక్కల్ మండ్రం నేతలు క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఉదయం నుంచి రజనీ కొత్త పార్టీ పేరు' మక్కల్ సేవే కట్చి ' అని ఆటో గుర్తును కేటాయించారని వార్తలు వచ్చాయి.
కొద్ది రోజులుగా రజనీ అభిమాన సంఘ నాయకులు ఢిల్లీలో తిష్ట వేసి పార్టీ రిజిస్టర్ పనులపై ముమ్మర పనులు చేపట్టారు. దీంతో రజనీ కొత్త పార్టీ, గుర్తు పై వచ్చిన వార్తలు నిజమేనని అంతా భావించారు. మక్కల్ లోకల్ సేవే కట్చి పేరుతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఎవరో ఒక పార్టీని రిజిస్టర్ చేశారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లకు పేరు, సింబల్ లను కేటాయించింది. మక్కల్ సేవే కట్చి పార్టీ బాబా సింబల్ లాంటి గుర్తు కోరడంతో.. అది అందుబాటులో లేక అధికారులు ఆటో గుర్తు కేటాయించారు. అయితే బాబా సింబల్ కోరిన పార్టీ కావడంతో కచ్చితంగా అది రజనీకాంత్ పార్టీ అయి ఉంటుందని అంతా భావించారు. ఆ పార్టీకి ఆటో గుర్తు కేటాయించడంతో రజనీ పార్టీ సింబల్ ఇదేనంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.
దీంతో సాయంత్రం మక్కల్ మండ్రం నాయకుడు వీఎన్ సుధాకర్ మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. మక్కల్ సేవే పార్టీ రజనీకాంత్ స్థాపించిన పార్టీ అని వస్తున్న వార్తలన్నీ అబద్ధం అని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదని ప్రకటించాడు. కొత్త పార్టీ పేరు, ఇతర వివరాలు స్వయంగా రజినీకాంత్ ప్రకటిస్తారని అప్పటివరకు అభిమానులు ఓపిక పట్టాలని ఆయన కోరారు. దీంతో నిన్నటి నుంచి హంగామా చేస్తున్న అభిమానులు ఒక్కసారిగా చల్లబడ్డారు.