జగన్ మానియా...మామూలుగా లేదే!
రాజకీయాలు బాగా మారిపోయాయి. గతంలో నేతలు చెప్పే కాకమ్మ కబుర్లన్నీ వినేసి మా నాయకుడు మంచోడు అని జనం గుడ్డిగా నమ్మేసేవాళ్లు. కానీ ఆ రోజులు పోయాయి. ఇపుడు ఎవరు దేనిపై స్పందించినా... గత చరిత్ర తవ్వి బేరీజు వేసుకుని ఆడుకుంటున్నారు. ఓటర్లకు ఇపుడు సోషల్ మీడియా అందుబాటులో మాత్రమే కాదు - అండగా కూడా నిలుస్తోంది. అందుకే నేతలు మాటలను చక్కగా విశ్లేషిస్తున్నారు. జగన్ ట్రాన్స్ ఫార్మేషన్ ఏడాదిగా జనాల్ని బాగా ఆకట్టుకుంటోంది. రోజుకీ జనంలో జగన్ పై ఆదరణను పెంచుతోంది. అందుకే సీనియర్ నాయకులు కూడా జగన్ వైపు చూస్తున్నారు.
తాజాగా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాటికే ఆయన వైసీపీని పలుమార్లు సంప్రదించి రాయబారాలు పంపారు. ఒకట్రెండు దశలు చర్చలు కూడా జరిగాయట. టీడీపీలో ఉంటే మాజీలుగా మిగిలిపోవడం తప్ప భవిష్యత్తు శూన్యం అని భావించిన చాలా మంది మేడా బాట పడుతున్నారు. జగన్ ఎవరినీ పిలవరు... అందుకే ఆకర్షితులు అయిన వారే స్వయంగా వచ్చి అడిగితే తప్ప జగన్ కలవరు. ఎందుకంటే... జంపింగ్ లతో పార్టీ నిలబడదనేది జగన్ నమ్మకం.
అయితే, పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించని తెలుగుదేశం నేతలు చివరి నిమిషంలో రంగంలోకి దిగారు. మేడా అసంతృప్తికి కారణాలు ఆరా తీసి... ఆయన కోరికలన్నీ తీరుస్తాం పార్టీ వీడొద్దని వినతులు పంపుతున్నారట. టీడీపీ పెద్దల జోక్యం - హామీలతో ఆయన పార్టీ మారే ఆలోచన విరమించుకున్నారు. మేడా వెనక్కి తగ్గడంతో టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
ఒత్తిడితో వెనక్కు తగ్గిన మేడా అనుచర వర్గంలో అసంతృప్తి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే... రోజురోజుకీ వైఎస్సార్ కాంగ్రెస్ హవా - ప్రభంజనం జిల్లాలో విపరీతంగా పెరుగుతోంది. ఎందుకంటే కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో టీడీపీ గాలి వీచినా కడపలో ఆయనొక్కరే గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రమంతటా జగన్ గాలి వీస్తోంది. ఇక కడప పరిస్థితి ఎలా ఉంటుందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన అనుచరుల ఒత్తిడి ఎన్నికల ముందు అయినా మేడాపై పనిచేయొచ్చని చెబుతున్నారు.