అది తప్పుడు ప్రచారం : సానియా మీర్జా

Update: 2020-10-31 04:30 GMT
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్  సానియా మీర్జా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నారు. తాజాగా  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలపై సానియా స్పందించారు. కొన్ని మీడియాల్లో వ్యాపించిన నకిలీ వార్తలు అవి అని సానియా స్పష్టం చేసింది. వికారాబాద్ జిల్లాలోని పరిగి వద్ద సానియాకు ఫాంహౌస్ ఉందని.. ఫామ్‌హౌస్ సమీపంలో ఒక ఆవును కాల్చిచంపారని వివాదం చెలరేగింది. సానియామీర్జాపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేశారు. దీనిపై తాజాగా సానియా మీర్జా స్పందించింది.

 రెడిఫ్ నివేదిక ప్రకారం.. సానియామీర్జా గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 'వికారాబాద్ జిల్లాలోని పరిగి వద్ద ఒక ఆవును ఫాంహౌస్ సమీపంలో కాల్చి చంపినట్లు పుకార్లు షికార్లు చేశాయి. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు మీడియాలో నకిలీ.. హానికరమైన వార్తలు ప్రసారం చేశారు.. అసలు ఆ ఫాంహౌస్ కు, ఆవు కాల్చిచంపడానికి నాకు సంబంధం ఉందని ఆరోపించారు. నేను నిజంగా ఈ తప్పుడు వార్తలకు ప్రతిస్పందించాలని అనుకోలేదు.  కానీ ఈ విష ప్రచారం ఎక్కువ కావడంతో దీనికి స్వస్తి పలకాలని వివరణ ఇస్తున్నానని ’ సానియా మీర్జా తెలిపింది.

సానియా మీర్జా ప్రకటన విడుదల చేస్తూ.. ‘నాకు పరిగిలో ఏ ఫామ్ హౌస్‌ను లేదు. మీడియాలో ప్రస్తావించిన ఫాంహౌస్ లో పేర్కొన్న వ్యక్తి  అసలు ఎవరో తెలియదు. నాకు సంబంధం లేదు. చివరగా నేను సెప్టెంబర్ నుంచి అసలు భారత దేశానికి దూరంగా విదేశాల్లో ఉన్నాను ’అని సానియా స్పష్టం చేసింది.. ఈ ప్రకటనతో ఇప్పటికైనా వివాదానికి స్వస్తి పలకాలని.. భవిష్యత్తులో నేను ఇలాంటి నిరాధారమైన వార్తలను తనపై ప్రసారం చేయవద్దని ఆశిస్తున్నాను.’ అంటూ సానియా మీర్జా పేర్కొంది.

అంతకు ముందు, తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్..  సానియా మీర్జాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఫాంహౌస్ సమీపంలో ఆవును కాల్చిచంపారని విమర్శించారు. దీనిపై విచారణకు తెలంగాణ సిఎం కెసిఆర్ ను డిమాండ్ చేశారు.
Tags:    

Similar News