మోడీ మీద రాహుల్ పేల్చిన పంచ్

Update: 2017-10-24 10:28 GMT
త్వరలోనే జరగబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు కొంచెం సానుకూల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద రాహుల్ ఉత్సాహంగా పంచులు పేల్చుతున్నాడు. మోడీ ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా సెల్ఫీల కోసం తహతహలాడిపోతుంటాడన్న విమర్శలున్న సంగతి తెలిసిందే. దీనిపై సెటైర్ వేశాడు రాహుల్. కొందరు ఒక్కో సెల్ఫీ దిగుతుంటే చైనాలో ఒక్కో యువకుడికి ఉద్యోగం వస్తోందని ఎద్దేవా చేశాడు రాహుల్.

మేకిన్ ఇండియా పేరుతో మోడీ హడావుడి చేస్తున్నారని.. ఐతే ఇండియాలో పరిశ్రమల స్థాపనకు విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని రాహుల్ అన్నాడు. తనకు 500.. 1000 నోట్లు నచ్చలేదని అందుకే వాటిని తీసేశానని మోడీ ఓ సందర్భంలో అన్నారని.. మోడీ తన ఇష్టాయిష్టాల మేరకే నిర్ణయాలు తీసుకుంటారని రాహుల్ విమర్శించాడు. కొన్నాళ్లుగా గుజరాత్ లో అధికార భారతీయ జనతా పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఓబీసీ నాయకుడు అల్పేష్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా గుజరాత్ రాజధాని గాంధీ నగర్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని మోడీ మీద పంచులు పేల్చాడు రాహుల్ గాంధీ.
Tags:    

Similar News