రాహుల్ ఐరన్ లెగ్ మళ్లీ ఫ్రూవ్ అవుతుందా?

Update: 2016-08-30 12:58 GMT
కాంగ్రెస్ పార్టీలోని వందిమాగధులు ఎన్ని రకాలుగా ఆయన భజన చేయవచ్చు గానీ.. జనం వద్ద మాత్రం రాహుల్ కు ఐరన్ లెగ్ అనే పేరుంది. రాష్ట్రాల ఎన్నికలు జరిగేప్పుడు.. ఆయన ఎక్కడ చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అక్కడ పార్టీ మంటగలిసిపోతుందని ఓ నమ్మకం ప్రబలిపోయింది. దానికి మరో నిదర్శనం తయారయ్యేలా ఇప్పుడు రాహుల్ యూపీ ప్రచారానికి స్కెచ్ రెడీ చేస్తున్నారు.

ఇంతకు ముందు ఎక్కడ ప్రచారం చేసాడో అక్కడ కాంగ్రెస్  కు ఘోరమైన ఫలితాలు తెచ్చిఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న రాహుల్ గాంధి మళ్ళీ  అదే  ప్రయత్నం లో వున్నట్టుగా తెలుస్తుంది.  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గా తన వంతు బాధ్యత గా  వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ లో జరిగే రాష్ట్ర ఎన్నికల కోసం అపోజిషన్ పార్టీకి ఎంత భారిగా మెజారిటి ఇవ్వాలన్న విషయమై ఇప్పటి నుండే ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది.  ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో మహాయాత్ర మొదలు పెడ్తున్నారట. ఈ యాత్ర నెల రోజులు సాగుతుందట. దీన్ని బట్టి చూస్తే ఉత్తర్ ప్రదేశ్ లో  రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ వల్ల  కాంగ్రెస్ పార్టీ  పూర్తిగా తుడిచి పెట్టుకుని పోవచ్చని జనాలు అభిప్రాయపడుతున్నారు.
గతంలో రాహుల్ గాంధి చేసిన ప్రచార ఫలితాలను బెరీజు వేసుకుని ఈ యాత్రలో 39 జిల్లాలో పర్యటించే రాహుల్ గాంధి కనీసం 39 సీట్లు గెలిపిస్తాడా అని కాంగ్రెస్ పార్టీ లోనే చర్చింకుంటున్నారని తెలుస్తుంది.
Tags:    

Similar News