నాన్నను చంపిన వారిపై కోపం లేదన్న రాహుల్ గాంధీ

Update: 2021-02-18 03:30 GMT
తన తండ్రి రాజీవ్ గాంధీని హత్యచేసిన వారిపై తనకు కోపం, ద్వేషం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాండిచ్చేరికి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ 'నా తండ్రి మరణం నన్ను ఎంతగానో కృంగదీసిందని..అయితే దానికి కారణమైన వారిని నేను క్షమించానని రాహుల్ తెలిపారు.హింస వల్ల ఎవరికీ ఏమీ రాదని.. మా నాన్న నాతోనే.. నాలోనే ఉన్నారని తెలిపారు. నా ద్వారా మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. పుదుచ్చేరిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

ప్రస్తుతం పాండిచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నారాయణ స్వామి సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టాలని రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. అందుకే తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యను రాహుల్ గాంధీ మరిచిపోయినట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
Tags:    

Similar News