దేశాన్ని రెండుగా చీల్చిన మోడీ

Update: 2016-12-24 14:15 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త‌న విమ‌ర్శ‌ల దాటిని కొన‌సాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆయన మాట్లాడుతూ..పెద్ద నోట్ట రద్దుతో దేశాన్ని రెండుగా విభజించారని ఆరోపించారు. ఒక శాతం ఉన్న ధనికులు ఒకవైపు, 99 శాతం ఉన్న పేదలు మరో వైపు మారారన్నారు. జార్ఖండ్ - ఛత్తీస్ గఢ్ - మధ్యప్రధేశ్ రాష్ర్టాల్లో ఆదివాసీల భూములను లాక్కున్నారని రాహుల్ గాంధీ  ఆరోపించారు. నిజమైన నల్లధనం ఉన్నవాళ్లు వాటిని రియల్ ఎస్టేట్ - జుయ‌లరీ రంగాల్లో పెడుతున్నారు గాని బ్యాంకుల్లో కాదని తెలిపారు.కానీ సామాన్యులు మాత్రం త‌మ డ‌బ్బుల‌ను ఇటు విత్ డ్రా చేసుకోలేక అటు నిత్యావ‌స‌రాలు తీర్చుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని రాహుల్ గాంధీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన ప్ర‌కారం  స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్లను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ ఎందుకు తెప్పించలేక పోతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న పేద వారికి రూ.3 లడ్డు తినిపిస్తుందని, విజయ్ మాల్యా వంటి ఎగవేతదారులకు వారికి రూ.12000 కోట్లు వితరణ చేస్తోందని దుయ్యబట్టారు. ఇప్ప‌టికైనా పేద ప్ర‌జ‌ల ప‌క్షాన ఆలోచించ‌డం ప్ర‌ధ‌నామంత్రి అల‌వ‌ర్చుకోవాల‌ని రాహుల్ గాంధీ కోరారు.

ఇదిలాఉండ‌గా...  పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇవాళ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ చెక్కులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం అఖిలేష్ దుయ్య‌బ‌ట్టారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు నష్టపరిహారం చెక్కులు అందజేసినట్లు ఆయన చెప్పారు. అచ్చే దిన్ స్వప్నం మాదిరిగానే క్యాష్‌లెస్ ఆర్థిక‌వ్య‌వ‌స్థ క‌ల‌ల్లో బీజేపీ విహ‌రిస్తోందని, వాళ్లు ఎప్పుడు నేల‌పై దిగుతారో తెలియ‌ద‌ని అఖిలేశ్ విమ‌ర్శించారు. డ‌బ్బులు న‌లుపూ తెలుపూ ఉండ‌వ‌ని, ఇచ్చి పుచ్చుకోవ‌డంలోనే న‌లుపూ తెలుపూ ఉంటుంద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News