జవాన్లకు, అధికారులకిచ్చే ఆహారంలో తేడాలెందుకు: రాహుల్
కాంగ్రెస్ కీలక నేత , మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. కరోనా విజృంభన సమయం నుండి రాహుల్ మోడీ ప్రభుత్వం పై ప్రతిరోజూ ఎదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చైనా విషయంలో మోడీ సర్కార్ వ్యవహరించే తీరుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి మనవాళ్లు చైనాతో చర్చలు జరుపుతున్నారు. ప్రతిసారి ‘‘స్టేటస్ కో పునరుద్ధరణ'' తప్ప మరో మాట లేదు. భారత భూభాగం నుంచి చైనా బలగాలను వెనక్కి వెళ్లగొట్టే బాధ్యతను కేంద్రంగానీ, ప్రధాని మోదీగానీ నిరాకరిస్తున్నారు. అలాంటప్పుడు ఇకపై ఇతర చర్చలు పనికిరానివే అవుతాయి అంటూ రాహుల్ విమర్శలు చేస్తున్నారు.
తాజాగా రక్షణ శాఖపై గల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, మన సైనికులకు తక్కువ స్థాయి పౌష్టికాహారాన్ని ఇవ్వడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. సైనికాధికారులతో సమానంగా అందరికీ ఈ విధమైన ఫుడ్ అందజేయాలన్నారు. అధికారులకు ఒకలాగా, సాధారణ జవాన్లకు మరొకలా ఫుడ్ ఇవ్వడం వివక్ష చూపడమే అని రాహుల్ వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రస్తుత నిబంధనలను మళ్ళీ పరిశీలించాలని ఆయన సూచించారు. దేశ సరిహద్దుల్లో ఎండకి , వానకి ఎదురొడ్డి నిరంతరం దేశ రక్షణకోసం శ్రమిస్తున్న జవాన్లందరికీ హోదాతో నిమిత్తం లేకుండా పౌష్టికాహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లకు, అధికారులకు అందించే పోషకాల విషయంలో తేడాలెందుకు’’ అని రాహుల్ ప్యానల్‌ను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నను కేంద్రం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అయితే జవాన్లు, అధికారుల ఆహారపు అలవాట్లలోనే వ్యత్యాసం ఉందని, ఎందుకుంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారని కేంద్రం వివరణ ఇచ్చింది.