రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా మారిపోయిందంట!
పెద్ద నోట్ల రద్దు అంశం ఎవరికి ఎలా ఉపయోగపడింది అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ విషయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాత్రం రాజకీయంగా బాగా ప్లస్ అవుతుందనే చెప్పాలి. నిన్నమొన్నటివరకూ మోడీని విమర్శించడానికి, ప్రజల తరుపున తీవ్రంగా పోరాడటానికి రాహుల్ ఆ స్థాయిలో కనిపించేవారూ కాదు!! దీనికితోడు మీడియా అటెన్షన్ డ్రా చేయగలిగేటంత స్థాయిలో మాట్లాడేవారూ కాదు అనే విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే నవంబరు 8న ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న రాహుల్.. రోజు రోజుకీ సమస్యలు పెరిగిపోవడం, సామాన్యుల ఇబ్బందులు తారాస్థాయికి చేరడంతో నోటికి, చేతికీ కూడా పనిచెప్పారు.. ఫలితంగా మోడీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు నేరుగానూ, ట్విట్టర్ ద్వారానూ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తన దాడిని పెంచారు రాహుల్.
నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలకు మోడీ దుస్తులుమార్చడాని ఉదాహరణగా చూపించి వెటకారమాడిన రాహుల్.. తాజాగా మరోసారి ట్విట్టర్ లో ఆసక్తికరంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో స్పందించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ వరుసగా ఇస్తున్న ఆదేశాలను రాహుల్ తప్పుబట్టారు. దానికి ఉదాహరణ చూపిస్తూ అన్ని రంగుల్లోనూ గజిబిజిగా వెలుగుతున్నట్లు సిగ్నల్ లైట్లు ఉన్న ఒక ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి "నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ నిర్ణయాలు ఇలా ఉన్నాయి" అంటూ కామెంట్ చేశారు. ఇదే క్రమంలో నోట్ల రద్దు తర్వాత గడిచిన 43 రోజుల్లో ఆర్బీఐ 126సార్లు నిబంధనలు మార్చిందని, ఆర్బీఐ తీరు చూస్తుంటే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్తా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా విమర్శించారు. ఈ స్థాయిలో కాంగ్రెస్ నేతలు తమ దూకుడును ప్రదర్శించడానికి మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పరోక్షంగా సహకరించినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/