మోడీకి 40 మార్కులే వ‌చ్చాయి

Update: 2017-06-12 15:30 GMT
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ త‌న ప్రసంగాల వాడి పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తున్న రాహుల్ తాజాగా దానికి చెణుకులు జోడించారు. బెంగుళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు.  ప‌రీక్ష‌ల్లో 40 మార్కులు వ‌స్తేనే పాస‌వుతార‌ని, కానీ ఉద్యోగాల క‌ల్ప‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సున్నా మార్కులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శించారు.

కేంద్ర ప్ర‌భుత్వం అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని అయితే వాటిలో మెజార్టీ ప్ర‌చారానికి త‌ప్ప ఫ‌లితం ఇచ్చే దిశ‌లో లేవ‌ని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. స్టార్ట‌ప్ ఇండియా - స్టాండ‌ప్ ఇండియా - సిట్‌ డౌన్ ఇండియా - మూవ్‌ లెఫ్ట్ ఇండియా అంటూ స్టార్ట‌ప్ ఇండియా ప‌థ‌కంపై విమ‌ర్శ‌లు చేశారు. స్టార్ట‌ప్ ఇండియా పేరుతో పెద్ద ఎత్తున ప‌బ్లిసిటీ చేసుకున్నార‌ని కానీ ఎవ‌రికీ ఉద్యోగాలు క‌ల్పించ‌లేద‌ని మండిప‌డ్డారు. ప‌బ్లిసిటీ కోసం ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల ధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆర్మీ చీఫ్‌పై కాంగ్రెస్ నేత‌లు ఘాటైన వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను రాహుల్ కొట్టిపారేశారు. సైన్యం గురించి రాజ‌కీయ నాయ‌కులు కామెంట్ చేసే అవ‌స‌ర‌మే లేద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News