కొత్త ‘ట్యూబ్ లైట్’.. రాహుల్ గాంధీ

Update: 2017-06-29 04:52 GMT
అట్టర్ ప్లాఫయిన సల్మాన్ ఖాన్ సినిమా ట్యూబ్ లైట్ ను కొందరు నెటిజన్లు రాహుల్ గాంధీపై సెటైర్లకు వాడుకుంటున్నారు. అయితే... అందులో తీవ్రత ఎక్కువవడంతో కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
    
ట్యూబ్ లైట్ సినిమా పోస్టర్ లో  సల్మాన్ మెడలో బూట్లు వేసుకుని సైకిల్ పై వెళుతున్నట్లుగా ఉంటుంది. దీనిని కొంతమంది మార్ఫింగ్ చేసి, ఆ పోస్టరులో సల్మాన్ ముఖానికి బదులు రాహుల్ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో పెట్టారు. పైగా అక్కడ  "ట్యూబ్ లైట్ " ‘కభీ నా జల్నే వాలి’(ఎన్నడూ వెలగని ట్యూబ్ లైట్) అంటూ ట్యాగ్‌ లైన్ పెట్టారు.
    
దీన్ని కేవలం రాహుల్ పై విమర్శలకే కాకుండా దిగ్విజయ్ ను కూడా ఇందులోకి లాగారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు చెందిన డాగీ ఫిలిమ్స్ సమర్పణలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ - లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హాఫీజ్ సయీద్ నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా నిర్మితమైందని ఆ పోస్టరులో పేర్కొన్నారు. దానితో పాటు ‘క్యా తుమే యఖీన్ హై కీ మైనే పీఎం బనుంగా’ అంటూ రాహుల్ పేర్కొంటున్నట్టు మరో వ్యాఖ్యను జోడించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.
    
సోషల్ మీడియాలో ఇది హల్ చల్ చేస్తుండడంతో  కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. మార్ఫింగ్ పోస్టర్ తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News