వృద్ధి రేటు పతనమైనా .. సర్కారు సాయం ఇంత స్వల్పమా? .. రఘురాం రాజన్​ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-09-08 06:30 GMT
కరోనా దెబ్బకు భారతదేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని .. 2020-21 ఆర్థికసంవత్సరానికి తొలి కార్టర్​లో 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిందని ఆర్బీఐ మాజీ గవర్నర్​ రఘురాం రాజన్​ పేర్కొన్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా ప్రభావంతో అమెరికా, ఇటలీకంటే భారతదేశమే అత్యధికంగా నష్టపోయిందని చెప్పారు.   ప్రస్తుతం ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రోగం ముదరకముందే వైద్యం చేయాలి గానీ ముదిరాక చేస్తే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

రంగరాజన్​ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘ఈ ఏడాది తొలిత్రైమాసికంలో జీడీపీ పతనమైంది. నిర్మాణరంగం, తయారీరంగం, హోటల్స్​, ట్రాన్స్​పోర్ట్​ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వృద్ధిరేటు రికార్డ్​స్థాయిలో పతనమైంది.  ప్రభుత్వం ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా అందజేసిన ప్యాకేజీ దేనికీ సరిపోదు. భవిష్యత్​ కోసం ప్రభుత్వం వనరులను ఆదా చేస్తోందని ఇది సరికాదు. ఇది స్వీయ ఓటమిగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలి. పేదలకు నగదు పంపిణీ చేయాలి. వివిధ రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. చిరువ్యాపారులకు, చిన్నపరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు అందజేయాలి. రైతులకు రుణాలు మాఫీచేయాలి అలాచేస్తేనే ఆర్థికరంగం బాగుపడింది’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్​చేశారు.
Tags:    

Similar News