మిల్పిటాస్ గౌర‌వ క‌మిష‌న‌ర్‌ గా తెలుగు బిడ్డ‌

Update: 2017-05-28 04:29 GMT
తెలుగువారంద‌రికీ సంతోష‌క‌ర‌మైన వార్త ఇది. ఇంకా చెప్పాలంటే గ‌ర్వ‌కార‌ణమైన వార్త ఇది. ఇటీవ‌లి కాలంలో మ‌న‌కు వ‌రుస‌గా ఇబ్బందిక‌ర‌మైన వార్త‌లు వినిపిస్తున్న అమెరికా నుంచి వ‌చ్చిన అద్భుత‌మైన వార్త‌. అమెరికాలోని మిల్పిటాస్ సిటీ గౌరవ కమిషనర్‌ గా తెలుగు వ్యక్తి, ప్రముఖ సంఘసేవకులు కాకి రఘురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మిల్పిటాస్ సిటీ టౌన్‌ హాల్‌ లో ఆయనకు గౌరవ సత్కార కార్యక్రమం జరిగింది. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అందించిన స్వచ్ఛంద సేవలకుగాను అదేవిధంగా ఆయనలోని నాయకత్వ లక్షణాలకుగాను ఈ గౌరవం దక్కింది.

యూఎస్‌ఏ వ్యాప్తంగా జరిగే సేవా కార్యక్రమాల్లో రఘురెడ్డి చురుగ్గా పాల్గొంటూ తనవంతు చేయూత అందిస్తుంటారు. ఆయన ఎంతో కాలంగా ఏటీఏకు రీజినల్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఈ మధ్యనే అతిపెద్ద తెలుగు సంఘంకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి సిటీ మేయర్, కౌన్సిల్ సభ్యులు హాజరవ్వగా కుటుంబ సభ్యుల మధ్య ఆయన ఈ గౌరవ సత్కారం స్వీకరించారు. యూఎస్ ప్రభుత్వంతో మన తెలుగు వ్య‌క్తి ఇలా గుర్తింపు పొందుతూ గౌరవింపబడటం మనందరికి గర్వకారణం అని అక్కడి స్థానిక తెలుగు ప్రజలు పేర్కొన్నారు.రఘురెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News