ఇది యావత్ భారత దేశంపై దాడి:రాహుల్ గాంధీ
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాతో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా, పలువురు కాంగ్రెస్ నేతల ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ ఇండియా లాక్ చేసిన సంగతి తెలిసిందే. రేప్ కు గురైన ఓ చిన్నారి వీడియోను రాహుల్ ట్వీట్ చేశారని, అలా చేయడం ట్విటర్ నియమనిబంధనలకు విరుద్ధమని చెబుతూ ట్విట్టర్ ఇండియా ఈ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ట్విట్టర్ పై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ నిన్న మండిపడ్డారు. ట్విట్టర్ మోదీ చెప్పినట్లు పనిచేస్తోందని ఆమె విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. తన ట్విట్టర్ ఖాతాను లాక్ చేయడం సరికాదని, ఈ చర్యతో ట్విటర్ రాజకీయల్లో వేలు పెట్టిందని రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రజాసేవే తమకు పరమావధి అని, అటువంటి నేపథ్యంలో ట్విట్టర్ వంటి ఒక కంపెనీ చేసిన పని రాజకీయనాయకుడిగా తనకు ఏమాత్రం నచ్చలేదని రాహుల్ దుయ్యబట్టారు. ట్విట్టర్ రాహుల్ గాంధీపై దాడి చేయలేదని, యావత్ భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు ట్విట్టర్ లో 2 కోట్ల మంది ఫాలోవర్లున్నారని, వారి హక్కులను ఆ సంస్థ అడ్డుకుందని రాహుల్ మండిపడ్డారు. ఇలా చేయడం కచ్చితంగా చట్ట వ్యతిరేకమని, ట్విట్టర్ ఒక తటస్థ వేదిక అనే ఆలోచనను ఈ చర్య తుడిచిపెట్టేసిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని, అధికార పార్టీ చెప్పిన మాటలను ట్విట్టర్ వింటోందని రాహుల్ బీజేపీనుద్దేశించి విమర్శలు గుప్పించారు.
ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ అన్నారు. తాము పార్లమెంట్‌లో గొంతు విప్పలేకపోతున్నామని, మీడియా కూడా ప్రభుత్వం కంట్రోల్ లో ఉందని, ఇక తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేందుకు వేదికైన ట్విట్టర్ తమకు ఓ ఆశా జ్యోతి అని రాహుల్ అన్నారు. కానీ, చివరకు ట్విట్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు తమ అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఉండడం బాధాకరమని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.