ఖతార్ ఎయిర్ పోర్ట్ వాష్‌ రూంలో శిశువు..13మంది మహిళలను వివస్త్ర చేసి వైద్య పరీక్షలు

Update: 2020-10-26 11:10 GMT
ఖాతర్ రాజధాని దోహా విమానాశ్రయంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువును ఎయిర్ పోర్ట్ సిబ్బంది కనుగొన్నారు. ఎవరో అప్పుడే ప్రసవించి వదిలేసి వెళ్లిపోయారని విమానాశ్రయ  సిబ్బంది ఆస్ట్రేలియాకు చెందిన 13 మంది మహిళలను  అనుమానించి వారిని పూర్తిగా వివస్త్రలుగా మార్చి మహిళా  వైద్యులతో పరీక్షలు చేయించారు. ఈ సంఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖతార్  ఎయిర్ పోర్టు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.దోహాలో ఫ్లైట్ క్యూ ఆర్ 908 విమానం శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఖతార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిడ్నీకి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్ పోర్టు సిబ్బంది బాత్రూంలో అప్పుడే పుట్టిన శిశువు ను  గుర్తించారు. ఎవరో ప్రసవించి బిడ్డను వదిలేసి పోయారని భావించారు.

దీంతో అధికారులు రన్ వేపై  కదలడానికి సిద్ధంగా ఉన్న సిడ్నీ  విమానం టేకాఫ్ అవకుండా నిలిపేశారు. ఆస్ట్రేలియాకు చెందిన 13 మంది  మహిళలను కిందకు దింపి, మహిళా వైద్యుల చేత దుస్తులు విప్పి పరీక్షించారు. వారిలో ఎవరైన ఇటీవల  డెలివరీ అయ్యారా.. అని మూడు గంటల పాటు  అలాగే నిలబెట్టి పరీక్షలు జరిపారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత మహిళలు చాలా కలత చెంది కనిపించారని, కొందరు కన్నీరు పెట్టుకున్నారని  ఆ విమానంలోని ఓ ప్రయాణికుడు వెల్లడించాడు.ఈ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం మా దేశ మహిళలను అవమానిస్తారా.. అంటూ ఖతార్ విమానాశ్రయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమానం వస్తే మాత్రం ఇలా  ఒంటిపై దుస్తులన్నీ విప్పేసి  అనాగరికంగా ప్రవర్తిస్తారా అంటూ ఆస్ట్రేలియన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News