ఏపీ చిన్నమ్మ బీజేపీలోనే ఉంటుందట

Update: 2017-03-02 10:04 GMT
ఏపీ చిన్నమ్మగా సుపరిచితురాలు ఎన్టీఆర్ కుమార్తె.. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రస్ పార్టీలో కొనసాగిన ఆమె.. తర్వాతి కాలంలో బీజేపీలో చేరటం.. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోవటం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారనున్నట్లుగా వార్తలు జోరందుకోవటం తెలిసిందే.

గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పార్టీ మారే అంశం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటివరకూ మాట్లాడని పురంధేశ్వరి తాజాగా రియాక్ట్ అయ్యారు.సోషల్ మీడియా బాధ్యతతో వ్యవహరించాలన్నారు. బీజేపీని వదిలేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో తాను చేరుతున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్న ఆమె.. తాను బీజేపీని వదిలిపెట్టే ఆలోచనలో లేనట్లుగా వెల్లడించారు.

తాను పార్టీ మారుతున్నట్లుగా సాగుతున్న ప్రచారం తనను బాధించిందని.. ఎవరి సెంటిమెంట్ ను బాధించాలన్న ఉద్దేశం తనకు లేదన్న ఆమె.. బీజేపీలోనే కొనసాగుతానని.. ఒకవేళ పార్టీని విడిచి పెట్టాల్సి వస్తే.. తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన భర్త మాదిరే తాను కూడా నైతిక విలువలతో ప్రజాజీవనాన్ని సాగించినట్లుగా చెప్పిన ఆమె.. తాను పార్టీ మారే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News