పబ్జీ ఎఫెక్ట్ : ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి !

Update: 2020-09-12 23:30 GMT
ప్రస్తుత యువత పొద్దున్న లేచినప్పటి నుండి పడుకునే వరకు సోషల్ మీడియా లో మునిగితేలుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో స్కూల్స్ కూడా లేకపోవడంతో ఆన్లైన్ గేమ్స్ , సోషల్ మీడియా సైట్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. అయితే , ఆన్లైన్ గేమ్స్ పిచ్చితో కొంతమంది యువత తమ ప్రాణాలని కూడా వదిలిపెడుతున్నారు. తాజాగా... పబ్జీ గేమ్‌ కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం నగరంలో రెవెన్యూ కాలనీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురంలో రెవెన్యూ కాలనీకి చెందిన కిరణ్ ‌కుమార్ రెడ్డి చెన్నైలో బీటేక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజ్ లో  చదువుతున్న సమయంలో పబ్బీ గేమ్‌కు బానిస అయ్యాడు. లాక్‌ డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన కిరణ్, అధిక సమయం ఆన్ ‌లైన్ గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీపై నిషేధం విధించడంతో కిరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ నెల 7న వారి ఇంటిపైన నిర్మాణంలో ఉన్న ఓ గదిలోకి వెళ్లి ఊరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే అప్పటి నుంచి కిరణ్ కనిపించకపోవడంతో అతని తల్లిదండ్రలు నరసింహారెడ్డి, హిమాజ రాణి పలు చోట్ల గాలించారు. అయిన లాభం లేకపోవడంతో తమ కుమారుడు కనిపించడం లేదని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక, శుక్రవారం ఇంటిపై నిర్మాణంలో ఉన్న గది నుంచి దుర్వాసన వస్తుండటంతో కూలీలు, ఆ గది తలుపులు పగలగొట్టి చూశారు. అక్కడ కిరణ్ ఊరికి వేలాడుతూ కనిపించాడు. కుమారుడి అలా చూసిన తల్లిదండ్రలు బోరున విలపించారు. ఈ ఘటనకు సంబంధించి త్రీటౌన్ పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారు.
Tags:    

Similar News