అట్టుడికిపోతోన్న పాక్ .. ఇమ్రాన్ కి వ్యతిరేకంగా నిరసనలు

Update: 2021-10-25 10:52 GMT
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిరసనలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీధుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. నిరుద్యోగులు పెరిగి పోవడం సహా నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్‌ తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. తమ దేశ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వందలాది మంది కార్మికులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను కార్మికులు ప్రదర్శించారు.

దేశంలోని పేదలకు రోజుకు రెండు పూటలా భోజనం కూడా లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సూమ్రో అన్నారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌ కు తెలియదని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలలో భాగంగా లాహోర్‌ లో భద్రతా దళాలు, ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులను నిరసనకారులు హత్య చేయగా, అనేక మంది ఆందోళన కారులు గాయపడ్డారు. గత ఏడాది ఫ్రాన్స్‌ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో అరెస్ట్‌ చేసిన తమ నేతను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌ కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు.
Read more!

లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు అడ్డుకోవడం వల్ల ఈ ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడం వల్ల నిరసనకారులు దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు.

ఇక,లాహోర్‌ లో భద్రతా దళాలు, ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులను నిరసనకారులు హత్య చేయగా, చాలామంది ఆందోళన కారులు గాయపడ్డారు. గత ఏడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో అరెస్ట్‌ అయిన టీఎల్పీ పార్టీ నేత షాద్ రజ్వీని విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు. మరోవైపు, ఫారెక్స్ మార్కెట్‌లో పాకిస్థాన్ రూపాయి ప‌త‌నం కొన‌సాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి వ‌రుస‌గా పాకిస్థాన్ రూపీ బ‌ల‌హీన‌ప‌డుతూ వ‌స్తున్న‌ది. అమెరికా డాలరుతో పాకిస్తానీ రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేని రీతిలో క్షీణించింది.


Tags:    

Similar News