జ‌గ‌న్ మ‌ద్య నిషేధం... అమెరికా ఆశ్య‌ర్య‌పోయే పాఠం

Update: 2020-10-14 02:45 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్  మోహ‌న్ రెడ్డి తీసుకున్న ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాల్లో మ‌ద్య నిషేధం ఒక‌టి. సీఎంగా గెలిచినప్పట్నుంచే మ‌ద్య నిషేధంపై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే, ఈ మ‌ద్య నిషేధం అమ‌లు విష‌యంలో అనేకానేక స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని అంటున్నారు. దీనికి పక్కా ఉదాహ‌ర‌ణ అగ్ర‌రాజ్యం అమెరికాలో జ‌రిగింద‌ని అంటున్నారు.

మద్య‌ నిషేధం అంటే అసలు చిన్న విషయం కాదు అప్పట్లో ఎన్టీఆర్ హయాం లో మధ్య నిషేధం చేస్తేనే పెద్ద సంచలనం. తరవాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు దాన్ని తుంగలో తోక్కారు. మద్య‌ నిషేధం ద్వారా రాష్ట్ర ఆదాయం గట్టిగ దెబ్బ తింటోంది అని అప్పట్లో చంద్రబాబు స్వయంగా మద్య‌ నిషేదాన్ని అటక ఎక్కించిన సంగతి తెలిసిందే.  అయితే, జ‌గ‌న్ మాత్రం ఎన్నిక‌ల హామీని అమ‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్ షాపుల టైమింగ్స్ ను తగ్గించారు. ఇప్పటికే ప్రైవేటు వైన్ షాపులు, 40 శాతం బార్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రైవేటు వైన్ షాపుల స్థానంలో సర్కారే మద్యం దుకాణాలను తెరిచింది. మద్యం అమ్మకాలను కుదించింది. రెండు విడతల్లో 60 నుంచి 70 శాతం మేర భారీగా మద్యం రేట్లు కూడా పెంచింది. అయితే మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో అమలుపర్చడం మాత్రం అయ్యే ప‌ని కాదంటున్నారు నిపుణులు.

కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని అధికారులు చెబుతున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో  మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరమితమవుతున్నాయని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్‌ షాపులను తొలగించడంతో గ్రామాల్లో మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా నిఘా ఉంచడం ద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. అయితే, మ‌ద్యం ల‌భించ‌క కొంద‌రు శానిటైజ‌ర్ తాగిన సంగ‌తి తెలిసిందే.

అమెరికాలో జ‌రిగిన సంచ‌ల‌న ఉదంతాన్ని గ‌మ‌నిస్తే, 1920లో ఆనాటి అమెరికా ప్రభుత్వం  మద్య నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిసైడ‌యింది. ఆల్కహాల్‌ ఎవరికీ అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవ‌డంతో, ఇథైల్‌ ఆల్కాహాల్‌తో చేసిన‌ మద్యం తాగారు. ఇలా విషపూరిత రసాయనాలు కలిసిన ఆల్కహాల్‌ను తాగడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. మరికొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కనీసం 10 వేల మంది మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో, ఆల్కహాల్‌ను నిషేధించడం సాధ్యం కాదని భావించి 1933లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ రూజ్‌‌వెల్ట్‌ మద్య నిషేధాన్ని ఎత్తివేస్తూ సంతకం చేశారు. చిత్రంగా మ‌ద్యం అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా త‌ర్వాత ఈ ఆదేశాలు వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇదంతా ఎందుకు కొంద‌రు చెప్తున్నారంటే...ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు చెక్ పెట్టానుకున్న‌వారు వీటిని సైతం దృష్టిలో ఉంచుకోవాల‌ని.
Tags:    

Similar News